పుల్లారావుకూ చంద్రబాబు షాక్ – ముసలం తప్పదా ?

టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఆపార్టీ లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కోడెల కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు చిలుకలూరిపేట నేత ప్రత్తిపాటి పుల్లారావుకూ చంద్రబాబు అదే షాక్ ఇచ్చారు. ఆయనకు టిక్కెట్ లేదన్న సంకేతాలు పంపడంతో ఆయన ఫీలవుతున్నారు. ఎవరెవరో వచ్చి తన టిక్కెట్ అడగడమేమిటని ఆయన పార్టీ ఆఫీసులోనే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ చిలుకలూరిపేట అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ !

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్ధిగా గత కొంతకాలం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తోంది. చిలకలూరిపేట నుంచి పుల్లారావు పలుమార్లు గెలిచారు. గత ఎన్నికల్లో తన శిష్యురాలు విడదల రజనీ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. రజనీని టీడీపీలోకి తెచ్చి .. మహానాడు వేదికపై మాట్లాడే అవకాశం ఇప్పింటి అందరి కంట్లో పేడేలా చేశారు. తర్వాత ఆయన టిక్కెట్ కే ఎసరు పెట్టడంతో దూరం పెట్టారు. తర్వాత ఆమె వైసీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకుని ఏకంగా మంత్రి అయిపోయింది.

టీడీపీ ఓడిపోయిన తర్వాత నాలుగేళ్లు సైలెంట్ గా ఉన్న పుల్లారావు

టీడీపీ ఓడిపోయిన తర్వాత పుల్లారావు యాక్టివ్ గా లేరు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబసభ్యులు చేసిన పనుల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆతర్వతా పుల్లారావు నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్‌లోనే గడిపారు. అందరూ కేసులు పాలై పార్టీ కోసం పని చేస్తే పుల్లారావు మాత్రం మంత్రి రజనీతో కలిసి లోపాయికారీ రాజకీయాలు చేశారన్న ఆరోపణలు టీడీపీ నతేలు చేశారు. దీంతో హైకమాండ్ భాష్యం ప్రవీణ్‌ను రంగంలోకి దించిందంటూ ఊహాగానాలు వినిపించాయి.

టిక్కెట్ తనకే కావాలని పుల్లారావు పట్టు

అసలు చిలకలూరిపేటకు భాష్యం ప్రవీణ్‌కు సంబంధం ఏంటీ అని ప్రశ్నించారు. అతనికి ఇక్కడ కనీసం ఓటు హక్కు కూడా లేదని పుల్లారావు దుయ్యబట్టారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడెదో రూ.కోటితో హడావుడి చేస్తారని.. తర్వాత చేతులెత్తేస్తారని పత్తిపాటి ఆరోపించారు పార్టీని పట్టించుకోకుండా సీనియర్లు తిరుగుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వున్న నేతలకు, గెలుస్తామనే నేతలకే టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. అన్ని విషయాలు పార్టీ పెద్దలకు చెప్పానని .. రూ.కోటి ఇస్తే ప్రోత్సహిచ్చేస్తారా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.