తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును .. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు. మామూలుగా అయితే ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలి. కానీ ఆయన హౌస్ కస్టడీ కావాలని మొదట పిటిషన్ వేశారు. ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కానీ … బెయిల్ పిటిషన్ మాత్రం దాఖలు చేయలేదు. మరో వైపు టీడీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంది.
భారీ ప్రచార కార్యక్రమాలతో టీడీపీ
చంద్రబాబుతో మేముంటామని.. ఆయనను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఒక్క ఆధారం లేకపోయినా అరెస్ట్ చేశారని.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేలా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇప్పిస్తే అరెస్ట్ చేశారని చెబుతూ.. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గా ల కేంద్రంగా బాబుతో మేము అనే ఓఎమోషన్ పెంచేందుకు స్ట్రాటజిక్ గా ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో సానుభూతి అస్త్రం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనను అన్యాయంగా వేధిస్తున్నారని ప్రజలు అనుకుంటే…. టీడీపీ అడ్వాంటేజ్ వస్తుంది.
చంద్రబాబు వ్యూహాత్మకంగానే జైల్లో ఉంటున్నారా ?
చంద్రబాబు వ్యూహాత్మకంగానే జైల్లో ఉంటున్నారన్న వాదన రాజకీయాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు కుంగిపోవడం అనేది ఉండదని.. దేన్నైనా ఆయన రాజకీయ లబ్దికి వాడుకుంటారని .. రాజకీయ విశ్లేషణలు చెబుతూ ఉంటాయి. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులుజైల్లో ఉంచలేరని ఆయనకు తెలుసని.. అందుకే… వీలైనంత గా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు రాజకీయం ఊహించని విధంగా ఉంటోందని చెబుతున్నారు. ఇంకా ప్రభుత్వం ఏమైనా కేసులు పెట్టి.. లోకేష్ .. పవన్ కల్యాణ్ నూ అరెస్టు చేసి… ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తుందన్న ప్రచారాన్నిబయట చేస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానే అనుకుంటున్నారు.
సానుభూతి పవనాలు వీస్తే …?
రాజకీయాల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సానుభూతి పవనాలు వీస్తే.. ఆయా పార్టీలకు తిరుగు ఉండదు. పైగా చంద్రబాబు గతంలోనే ఇవే తనకు చివరి ఎన్నికలన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రానికి ఎంతో చేశానని.. చివరి అవకాశం ఇవ్వాలని ఆయన అడిగితే.. .. ప్రజలు కరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. ఏపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారిపోయాయని అంచనా వేస్తున్నారు.