కళ్యాణదుర్గం టీడీపీని గాలికొదిలేసిన చంద్రబాబు – అక్కడ సైకిల్ చక్రాలు చెరొకరి దగ్గర !

అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేల స్థాయి నుంచి మండల స్థాయి నేతల వరకు వర్గపోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యాత్రలు చేపడుతుంటే నియోజకవర్గంలో మాత్రం వర్గ పోరుతో నాయకులు మాత్రం తగవులాడుకుంటున్నారు.

ఉన్నం – మాదినేని వర్గాల మధ్య పోరు

ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జ్ గా మాదినెని ఉమమహెశ్వరనాయుడు కోనసాగుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి ఒక వర్గం. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన మాదినెని ఉమామహేశ్వర నాయుడు ది మరో వర్గం. ఈ రెండు వర్గాలు పార్టీ కార్యక్రమాలను వేరువేరుగా నియోజకవర్గంలో చేపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తుండడంతో టికెట్ తమదంటే తమదంటూ ద్వితియశ్రేణి నాయకుల వద్ద దిమా వ్యక్తం చెస్తున్నారు. ద్వితియశ్రేణి నాయకులు రెండు వర్గలుగా విడిపోవడంతో కళ్యణదుర్గం టిడిపి రెండు వర్గలుగా విడిపోయింది. ఈ వర్గ పోరు కాస్త అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.

టిక్కెట్ తమకంటే తమకని పోరాటం

పార్టీలో మంచి క్యాడర్ ఉన్న నియోజకవర్గంలో నేతలు వర్గ విభేధాలతో రెండుగా చీలారు. పలుమార్లు అధిష్టానం కూడా క్లాస్ తీసున్న పరిస్థితి మారలెదు. 2014 ఎన్నికల్లో ఉన్నం హనుమంతరావు చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో కొంత వ్యతిరేక పవనాలు వీచడంతో హనుమంతరాయ చౌదరిని పక్కనపెట్టి అధిష్టానం మాదినేని ఉమామహేశ్వర నాయుడు కు టిడిపి కళ్యాణదుర్గం నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది. రాష్ట్రంలో జగన్ వైపు వీచిన ఫ్యాన్ గాలికి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఓటమి చదివి చూశారు. ఉషా శ్రీ చరణ్ కళ్యణదుర్గం నియోజకవర్గంలో 19,896 ఓట్ల మోజార్టితో గెలుపోందారు. టిడిపికి ఈ ఎన్నికల్లో 68,155 ఓట్లు రావడం జరిగింది. ముఖ్యంగా మాదినేని ఉమమహెశ్వర్ నాయుడు ఓటమికి మాజి ఎమ్మల్యే ఉన్నాం హానుమంతరాయ చౌదరి వర్గం సహాకరించకపోవటం ముఖ్య కారణం.

ఇప్పటికీ నేతలను సర్దుబాటు చేయని హైకమాండ్

గతంలో చంద్రబాబు బస్సు యాత్రలోను.. లోకేష్ యువగలం పాదయాత్రలోను కూడా నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో నేతలు విడివిడిగానే టిడిపి కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరికి అతని కొడుకు మారుతి చౌదరికి నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నట్లు చర్చ కొనసాగుతుంది . హనుమంతుల చౌదరి వయసు కారణంగా తనకు చాన్స్ ఇవ్వకపోయినా కోడలు వరలక్ష్మికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ముందు ప్రతిపాదనను ఉంచారు. వీరి వర్గ పోరాటంతోనే టీడీపీ సైకిల్ చక్రాలు చేరొకరి చేతుల్లో ఉన్నాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.