బీజేపీ షరతులపై తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు – అందుకే రెండు రోజులుగా సైలెన్స్ ?

ఎన్డీఏలో చేరడానికి సిద్ధమైన చంద్రబాబు రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ఆయన మొదటి రోజు.. అమిత్ షా , జేపీ నడ్డాలతో చర్చించారు. కానీ అక్కడేం జరిగిందో తెలియదు. చంద్రబాబునాయుడు తర్వాతి రోజు ఉదయమే ఢిల్లీ తిరిగి వస్తారని చెప్పారు కానీ.. తిరిగి రాలేదు. ఆయన అక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారో మాత్రం ఎవరికీ తెలియడంలేదు. కానీ పార్టీ నేతలతో మేథోమథనం అయితే చేస్తున్నారు. ఎన్డీలో చేరడానికి బీజేపీ పెట్టిన షరతులపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్డీఏలో చేరాలంటే కొన్ని రూల్స్ ఉంటాయ్ !

టీడీపీ ఎన్డీఏలో చేరాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందేనని బీజేపీ హైకమాండ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అవేమిటన్నదానిపై స్పష్టత లేకపోయినా.. ఏపీలో బీజేపీ బలానికి తగ్గట్లుగా సీట్లు ఇవ్వడం.. వెన్నుపోటు పోడవకుండా గెలిపించే బాధ్యతను తీసుకోవడం వంటివి ఉన్నాయని చెబుతున్నారు. ఈ అంశంపై చందర్బాబు ఢిల్లీలోనే పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అసెంబ్లీ కన్నా ఎక్కువగా పార్లమెంట్ సీట్లను బీజేపీకి ఇవ్వజూపుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు ఎంపీ టిక్కెట్లపై హామీ ఇచ్చినందున వారిని ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై చర్చిస్తున్నట్లుగా చెబుతున్నారు.

తాము బేషరతుగా మద్దతిస్తామని జగన్ ప్రతిపాదన

మరో వైపు టీడీపీ ని ఎన్డీఏలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని తాము బేషరతుగా మద్దతుగా ఉంటామని వైసీపీ చీఫ్ జగన్.. బీజేపీ అగ్రనేతలకు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ లో గంటన్నర పాటు మోదీతో సీఎం జగన్ చర్చలు జరిపారు ఆ చర్చల సారాంశం బయటకు రాలేదు కానీ.. తమ వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని టీడీపీని కూటమిలోకి తీసుకోవద్దని ఆయన పరోక్షంగా చెప్పినట్లుగా తెలుస్తోంది.

కొద్ది రోజుల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయం

కొద్ది రోజుల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ, వైసీపీ ఇప్పటికే తమ అభిప్రాయాలను చెప్పాయి. టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించాలా వద్దా.. అన్నది బీజేపీ హైకమాండ్ రెండు రోజుల్లో తేల్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒంటరి పోటీకి బీజేపీ సన్నాహాలు చేసుకుంది. ప్రతి గ్రామానికి బీజేపీ కార్యకర్తలు వెళ్తున్నారు.