ఆఫ్ బాయిల్డ్ రైస్ తో కాన్సర్ ముప్పు!

సౌత్ లో ప్రధాన ఫుడ్ రైస్. ఎన్ని తిన్నా కానీ పిడికెడు అన్నం తింటే కానీ కడుపునిండినట్టు అనిపించదు. రోజుకి మూడు సార్లు అన్నం తినే వారు కూడా ఉన్నారు. ఏదో హాడావుడిగా ఇదో పని అన్నట్టు గబగబా వండేసి తినేయడం కాదు..అన్నం ఉడికిందా లేదా అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉడికీ ఉడకని అన్నం తినడం వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యాన్సర్ కి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

అరగదు
కొందరికి అన్నం బిరుసుగా ఉంటే ఇష్టం.. ముద్దలా ఉంటే తినటానికి ఇష్టపడరు. అందుకే వాటర్ తక్కువ వేసి వండుతారు. దీనితో రైస్ 70 నుంచి 80 శాతం మాత్రమే ఉడుకుతుంది. ఇలా పొడిగా ఉండే అన్నం తినటానికి బాగున్నా,డైజేషన్ కి ప్రాబ్లెమ్ అవుతుంది. ఇదే అన్నం పిల్లలకు తినిపిస్తే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది.

మందుల ప్రభావం పోదు
వరి పంట పండించేటప్పుడు వాడిన క్రిమిసంహారక మందులు ప్రభావం తగ్గాలంటే అన్నాన్ని పూర్తిగా ఉడికించాలి. బియ్యం నిల్వ ఉంచేందుకు కూడా రసాయనాలు చల్లుతారు. అవి పూర్తిగా తొలగిపోవాలన్నా అన్నాన్ని బాగా ఉడికించి తినాలి.

ఆర్సెనిక్ శరీరంలో చేరితే
బియ్యంలో ఉండే ఆర్సెనిక్ శరీరంలో చేరకుండా అడ్డుకోవాలంటే అన్నాన్ని పూర్తిగా ఉడికించాలి. ఆర్సెనిక్ నిండిన బియ్యాన్ని తినడం వల్లే 9,000 మందికి పైగా క్యాన్సర్ బారిన పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లకి గురవుతున్నారు.

అన్నం ఇలా వండండి
బియ్యాన్ని ఎంత బాగా ఉడికిస్తే ఆర్సినిక్ స్థాయిలు అంతగా తగ్గుతాయి. ఒక కప్పు బియ్యం వండడానికి కనీసం ఐదు కప్పులు నీటిని జోడించాలి. అన్నం ఉడికాక అదనపు నీటిని వడకట్టేయాలి. అప్పుడు ఆర్సినిక్ స్థాయిలు సగానికి పైగా తగ్గుతాయి. ముందుగానే బియ్యాన్ని నానబెట్టి ఆ తర్వాత వండినా మంచిదే. అన్నం ముద్ద అయినా పర్వాలేదు ఆర్సెనిక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇలా వండితేనే మంచిది. ఇలా అయితే భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

మన పూర్వికులు తెలిసో తెలియకో అన్నం ఉడికించి ఆ వాటర్ వార్చి తినేవారు. ఇప్పుడు కూడా ఇదే ఉత్తమ పద్దతి అంటున్నారు నిపుణులు. ప్రజంట్ రైస్ కుక్కర్ లు, ప్రెజర్ కుక్కర్ లు, ఇండక్షన్ స్టవ్ లు వాడుతున్నారు. వీటి వలన కూడా కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదు కదా.. జాగ్రత్త మరి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.