మారుతున్న జీవన విధానంతో ఆరోగ్యపరంగా చాలా మార్పులొస్తున్నాయి. అన్నిటికీ ప్రధాన కారణం బరువు పెరగడం. అనారోగ్య సమస్యలు అటాక్ చేయకుండా ఉండాలంటే వెయిట్ తగ్గాల్సిందే అంటున్నారు ఆరోగ్యనిపుణులు…ఇందకోసం చాలామంది ఫాలో అయ్యే పద్ధతి ఒకపూట భోజనం చేయడం…ఇంతకీ ఒకపూట భోజనం చేస్తే నిజంగా వెయిట్ తగ్గుతారా?…ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?
వన్ మీల్ ఎ డైట్ (OMAD)…ఇప్పుడిదే ట్రెండింగ్. వెయిట్ తగ్గాలంటే ఓ పూట భోజనం చేయడం. ఇలా చేస్తే తొందరగా బరువు తగ్గుతారని అంటారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం చాలామంది ఈ డైట్ ఎక్కువగా పాటిస్తుంటారు..ఇది అనుసరించి బరువు తగ్గేవాళ్లూ ఉన్నారు. శరీరంలోని కొవ్వును సాధారణంగా కరిగించుకోవడానికి ఇలా చేస్తుంటారు. ఈ డైట్ ప్లాన్ మిమ్మల్ని రోజుకు ఒక పూట మాత్రమే తినాలి. మిగిలిన రోజుల్లో మీరు కేలరీలు కలిగిన ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. ఈ డైట్ ప్లాన్‌తో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి.
ఒక్క పూట తింటే లాభాలు
ఓఎమ్ఏడీ డైట్.. మీ శరీరంలో కొవ్వుని బలవంతంగా కరిగించడం ద్వారా బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఈ డైట్ ప్లాన్ మిమ్మల్ని రోజుకు 23 గంటలు తినకుండా నియంత్రిస్తుంది. మీరు మీ క్యాలరీలన్నింటినీ ఒకే భోజనంలో తీసుకుంటారు. అల్పాహారం, లంచ్, డిన్నర్ ఏదైనా కానీ రోజులో ఒక్కసారే తింటారు. తద్వారా వేగంగా బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఇతర డైట్ ప్లాన్‌ల మాదిరిగా కాకుండా రోజంతా కేలరీలను లెక్కించాల్సిన అవసరం ఉండదు. ఒక పూట భోజనంలో ఏదైనా ఆహారం తీసుకోవచ్చు
OMAD డైట్ వల్ల నష్టాలివే
ఒక్కపూట భోజనం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా సమయం వరకు అధిక ఆకలితో ఉండాల్సి రావడం వల్ల వికారం, మైకం, చికాకు, మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఓఎమ్ఏడీ డైట్ పోషకాహార లోపాలకు దారితీస్తుంది. ఒకపూట భోజన సమయంలో తగినంత కేలరీలు పొందలేరు…బ్లడ్ షుగర్ తగ్గడానికి కూడా కారణమవుతుంది. ఈ డైట్ వల్ల బరువు తగ్గొచ్చు కానీ మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
అందుకే బరువు తగ్గడానికి ఇది సరైన పద్ధతి కాదు…ఆరోగ్యకరమైన ఆహారం తీకుకుంటూ శారీరక శ్రమద్వారా బరువు తగ్గడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు…
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం