జీడిపప్పు నిత్యం తినొచ్చా – తింటే ఏమవుతుంది!

శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నట్స్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా బాదం, వాల్ నట్స్ గురించి చెబుతారు కానీ జీడిపప్పు అని ఠక్కున చెప్పరు. ఇవి తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందనే ఆలోచనతో ఉంటారు. కానీ మీ ఆలోచన తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జీడిపప్పులోనూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అధికంగానే ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని కొందరు పచ్చివే తింటారు, మరికొందరు నేతిలో వేయించుకుని ఉప్పు కారం వేసుకుని తింటారు, ఇంకొందరు కూరల్లో వినియోగిస్తారు. ఎలా తిన్నా ఇందులో పోషకాలు అస్సలు తగ్గిపోవు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే వీటిని సూపర్ హెల్తీ ఫుడ్‌గా పిలుస్తారు. అయితే తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలన్న విషయాన్ని మరిచిపోరాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ జీడిపప్పు వల్ల ఎన్ని ఉపయోగాలంటే..

జీడిపప్పు గుండెకు మంచిది
జీడిప‌ప్పులో శ‌రీరానికి కావ‌ల్సిన ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. దీంతో విట‌మిన్లు ఎ, డి, ఇ, కెలు ఆ కొవ్వుల్లో క‌రుగుతాయి. ఈ ప‌ప్పులో ఆరోగ్య‌క‌ర‌మైన పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి సూక్ష్మ మోతాదులో మ‌న‌కు అవ‌స‌రం అవుతాయి. దీంతో శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. త‌ద్వారా గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది.

ర‌క్త‌హీన‌త‌కు
నిత్యం త‌గిన మోతాదులో జీడిప‌ప్పు తింటే ర‌క్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపం వ‌ల్ల ర‌క్త‌హీన‌త వ‌స్తుంది. దీంతో కాప‌ర్ కూడా త‌గ్గుతుంది. జీడిప‌ప్పులో కాప‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.

కంటికి మంచిది
క్యారెట్ల‌ు మాత్రమే కాదు జీడిప‌ప్పు కూడా కంటి ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. జీడిప‌ప్పు నిత్యం తింటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటి రెటీనాపై ఓ సుర‌క్షిమైన పొర‌ను ఏర్పాటు చేస్తుంది. దీంతో క‌ళ్లు సురక్షితంగా ఉంటాయి.

చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు
జీడిప‌ప్పు నుంచి తీసే నూనె మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. ఈ నూనెలో జింక్‌, మెగ్నిషియం, పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. అలాగే చ‌ర్మ క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి.

అధిక బ‌రువు తగ్గిస్తుంది
జీడిపప్పు తింటే బరువు పెరుగుతారన్నది అవాస్తవం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. వీటిలో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి కానీ ఇత‌ర ప‌దార్థాల్లా బ‌రువును పెంచ‌వు త‌గ్గిస్తాయి. ఎందుకంటే జీడిప‌ప్పు వృక్ష సంబంధ‌మైంది. జంతు సంబంధ ప‌దార్థాల్లో ఉండే కొవ్వు బ‌రువును పెంచుతుంది. కానీ వృక్ష సంబంధ ప‌దార్థాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. క‌నుక ఇవి మ‌న బ‌రువును త‌గ్గిస్తాయి. అయితే జీడిపప్పును తిన‌డం వ‌ల్ల బరువు పెరగకూదంటే అవి అలాగే తినాలి వేయించకూడదు.

జుట్టు పెరుగుతుంది
జీడిప‌ప్పు నిత్యం తిన్నా లేదా ఆ ప‌ప్పు నుంచి తీసిన నూనెను నేరుగా వాడినా వెంట్రుక‌లకు బలం చేకూరుతుంది. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

రోజుకు ఎన్ని తినాలి
అనాకార్దిక్ యాసిడ్ ప్రయోజనాల మేరకు రోజుకు కనీసం 20 గ్రాముల వరకు జీడిపప్పు తినొచ్చు. విటమిన్స్ ఎ, ఇ, కే, రాగి, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక పోషకాలు ఉన్న ఈ జీడిపప్పును మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు అన్నీ పొందవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం