14 ఏళ్లు ముఖ్యమంత్రిగా…. పదహారేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ మద్దతు ఉందన్న ప్రచారాన్ని ఏపీలో కొంత మంది నేతలు అంతర్గతంగా చేస్తున్నారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అదే చెబుతున్నారు. నేరుగా కేంద్రానికి తెలియదా అంటున్నారు. వైసీపీ నేతలు సీఎం జగన్ అన్ని కేంద్రానికి చెప్పే చేస్తున్నారని అంటున్నారు. దీంతో అందరూ బీజేపీ వైపు అనుమానంగా చూస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అని ఏపీ, తెలంగాణ నేతలు ఖండించినా ఈ ప్రచారం ఆగడం లేదు.
జగన్ ఢిల్లీ పర్యటన అంటూ రెండు రోజులుగా ప్రచారం
పదమూడు, పధ్నాలుగు తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నారని… మోడీ, అమిత్ షాలతో సమావేశం అవుతారని ప్రచారం చేస్తున్నారు నిజానికి అలాంటి అపాయింట్ మెంట్లు ఖరారు కాలేదు. ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అపాయింట్ మెంట్లు ఖరారైతే వెళ్లే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు అరెస్ట్ గురించి వివరించేదుకు జగన్ ఢిల్లీ వెళ్తురన్నారని.. వారి అనుమతితోనే ఇదంతా చేస్తున్నట్లుగా ఓ పుకారును ప్రజల్లో ముందుగానే పుట్టించడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.
ఇప్పటికే ఖండించిన బీజేపీ
ఈ అంశంపై బీజేపీ ఇప్పటికే ముందుగానే స్పందించింది. అక్రమ అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముందుగానే ఖండించారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, జాతీయ పార్టీలో రాజకీయ నిర్ణయాలు తీసుకునే కమిటీలో సభ్యుడు అయిన ఎంపీ కే.లక్ష్మణ్ కూడా చంద్రబాబు అరెస్టును తప్పు పట్టారు. అయినా పుకార్లు మాత్రం ఆపడం లేదు.
బీజేపీ అవసరం తమకు ఉందని సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం
ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజ్యాంగ సవరణలు చేయనున్నారు.
పార్లమెంట్‌లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలోని 543 స్థానాల్లో 67 శాతం మద్దతు దక్కాలి. దీంతో పాటుగా రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్ధించాలి. దీంతో పాటుగా దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదముద్ర వేయాలి. లోక్‌సభలో బీజేపీకి 333 సీట్ల ఉన్నందున 61 శాతం మద్దతు ఉన్నట్టే. కానీ.. బిల్లు ఆమోదానికి మరో 5 శాతం ఓటింగ్ అవసరం. లోక్‌సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో చూసుకున్నా… 38 శాతం ఎన్డీఏ కూటమికి మద్దతు ఉంది. అక్కడా వైసీపీ మద్దతు అవసరం. రాజ్యసభలో వైసీపీకి ఉన్న తొమ్మిది మంది సభ్యులు బిల్లుల ఆమోదానికి కీలకంగా మారారు. అందుకే తాము ఏం చేసినా బీజేపీ ఏమీ అనదని చెబుతున్నరాు.
రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు !
బీజేపీ రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. చందర్బాబు న్యాయపోరాటం చేస్తున్నారు. తప్పులేకపోతే ఆయన బ యటకు వస్తారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే అరెస్టు అక్రమం అనే విషయాన్ని మాత్రం తాము ఖండించామని అంటున్నారు. ఏపీలో ఏం జరిగినా బీజేపీకి అంటించకుండా మానుకోరు రెండు ప్రాంతీయ పార్టీల నేతలు.