ఏపీ బిజెపి సోషల్ మీడియా టీంకు ఢిల్లీ నుంచి పిలుపు

ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ది ప్రత్యేక స్థానం, ఇప్పుడున్న చాలామంది సెలబ్రిటీస్ మరియు పార్టీలు సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా వారి బానిని వినిపిస్తున్నారు.

రాజకీయ పార్టీలను తీసుకుంటే సోషల్ మీడియా వినియోగంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంది అని చెప్పవచ్చు , ఉదాహరణకు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన విధానం.

ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పండుగ వాతావరణం కనిపిస్తుంది… ఇప్పటికే వైసిపి, టిడిపి, జనసేన వేల కోట్లు ఖర్చుపెట్టి వారి పార్టీకి, పార్టీలోని వ్యక్తులకి వారి ప్రచారాన్ని విస్తృతం చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భాజపా లోని కొంతమంది యువతతో ఒక సోషల్ మీడియా టీం తయారు చేశారు….. దీనిలో ఒక కన్వీనర్, నలుగురు కోకన్వీనర్ లు, నలుగురు జోనలించార్జెస్, జిల్లా వారిగా కన్వీనర్స్ నియమించి, వీరందరికీ ఇన్చార్జిగా బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని నిర్మించారు.