స్మార్ట్ ఫోన్ వినియోగించాలన్న తాపత్రయం అందరికీ ఉంటుంది. అయితే భారీగా ఖర్చుపెట్టి కొత్త ఫోన్ కొనే పరిస్థితి అందరకీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆ సరదా తీర్చుకునేందుకు సెకెండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్లు కొంటుంటారు. అయితే తక్కువ దరకు లభిస్తాయి కదా అని కొనేసుకోవడం కాదు..కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో కొంత రిస్క్ కూడా ఉంటుంది.
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఇవి గమనించండి
- సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనడానికి ముందు ఔటర్ లుక్ పూర్తిగా గమనించండి. గీతలు, డెంట్లు వంటివి ఉన్నాయో లేదో చూసుకోండి. ఫోన్ బటన్లు, టచ్‌స్క్రీన్, కెమెరా, ఇతర ఫీచర్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేయండి.
- అత్యంత సాధారణ మొబైల్ ఫోన్ సమస్యలలో వాటర్ డ్యామేజ్ ఒకటి. దీనిని నిర్ధారించడం కూడా కష్టం. అయితే దీన్ని గుర్తించడానికి మీరు ఫోన్ తుప్పు పట్టడం లేదా స్క్రీన్‌పై నీటి మరకలను ఉన్నాయో లేవో చూడవచ్చు.
- మొబైల్ ఫోన్లో బ్యాటరీ ముఖ్యమైన భాగం. దానిని మార్చడం చాలా ఖర్చుతో కూడుకున్నది. బ్యాటరీ జీవితకాలాన్ని తనిఖీ చేయండి. ఛార్జింగ్ ఎంత సేపు వస్తుందో అడిగి తెలుసుకోండి చెక్ చేయండి
- ఫోన్ ఛార్జర్, హెడ్ఫోన్లు, బాక్స్ వంటి ఒరిజినల్ యాక్సెసరీస్‌తో వస్తోందో లేదో చెక్ చేయండి. లేకపోతే ధర తగ్గించమని అడగండి.
- విక్రేతను కలిసినప్పుడు మాల్ లేదా కాఫీ షాప్ వంటి అనేక మంది వ్యక్తులు ఉండే పబ్లిక్ ప్లేస్‌ని ఎంచుకోండి. ఇది మీ భద్రతకు ముఖ్యం. ఏదైనా మోసాన్ని నివారిస్తుంది.
-అమ్మకందారు నుంచి ఏదో ఒక రసీదు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అని తెలుసుకోండి. ఫోన్ కారణంగా భవిష్యత్ లో ఏవైనా ఊహించని సమస్యలు ఎదురైతే ఇది మీకు ఉపయోగపడుతుంది
- ఫోన్ IMEI నంబర్ గురించి విక్రేతను అడగండి. అది దొంగ ఫోనా కాదా అనేది కూడా ఆన్లైన్లో తనిఖీ చేయండి. అలాగే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఫోన్ బ్లాక్‌లిస్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
- ఫోన్ ఇప్పటికీ వారంటీలో ఉందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ వారంటీ ఉంటే, దాన్ని మీ పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫోన్‌కు సమస్యలు తలెత్తితే ఇది మీకు సహాయం చేస్తుంది.
- ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేటెడ్గా ఉందో లేదో నిర్ధారించుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ కొంటున్నట్లు అయితే సెట్టింగ్స్‌లో బ్యాటరీ లైఫ్ చెక్ చేసుకోండి. నాలుగు జనరేషన్ల కంటే ముందు మొబైల్ అయితే కొనకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ తర్వాత సాఫ్ట్ వేర్ అప్డేట్స్ అందించడం ఆపేస్తారు.