సినిమా అంటేనే ఊహా ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించడం. సాధారణంగా సమాజంలో జరిగే సంఘటనలకు హంగులు, ఆర్భాటాలు, కల్పితాలు, అతిశయోక్తి జోడించి తెరపై ఆవిష్కరిస్తారు. అసలు ఇలలో జరగనవి, ఊహకు అందనివాటితో సినిమాలు తీస్తుంటారు. అవే ఫాంటసీ సినిమాలు. స్మాల్ హీరో నుంచి స్టార్ హీరో వరకు ఇప్పుడు అందరి కన్ను ఫాంటసీ జోనర్ పై పడింది. ముఖ్యంగా సీనియర్ హీరోలైన చిరంజీవి-బాలకృష్ణ ఇద్దరూ సేమ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ తో బిజీగా ఉన్నారు…
పాన్ ఇండియా అంటే ఆ మాత్రం ఉండాలి
రెండు దశాబ్దాల కింద ఫాంటసీ మూవీల జోరు ఓ రేంజ్ లో ఉండేది. అప్పట్లో గ్రాఫిక్స్ అంతగా లేనప్పటికీ ఆకట్టుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించేవారు మేకర్స్. కానీ గ్రాఫిక్స్ ఖర్చు ఎక్కువ అవుతుండడంతో మళ్లీ కాస్త వెనకడుగు వేశారు. ఇప్పుడు సాంకేతికత అందుబాటులోకి రావడంతో మేకర్స్ మళ్లీ ఈ జోనర్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా సినిమాలు ఇదే జోనర్లో తెరకెక్కుతున్నాయి. సలార్, సైంధవ్, దేవర ఇవన్నీ కూడా ఆ జోనర్ లో వస్తున్నవే కాగా… విశ్వంభర, అఖండ 2 సోషియా ఫాంటసీ లుగా రాబోతున్నాయి. విజువల్ వండర్ గా ప్రేక్షకులను అలరించనున్నాయి. దర్శకనిర్మాతలు, హీరోలు అందరూ ఫాంటసీ కథలవైపే మొగ్గు చూపడం వెనుక కారణం లేకపోలేదు. పాన్ ఇండియా ప్రాజెక్టులు సక్సెస్ కావాలంటే పిరియాడిక్ లేదంటే ఫాంటసీ కథ అయితేనే ఉత్తమ మార్గం. అందుకే అందరూ ఈ బ్యాక్ డ్రాప్ స్టోరీలనే ఎంపిక చేసుకుంటున్నారు.
అఖండ 2 – విశ్వంభర
ఇప్పటికే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న బాలకృష్ణ.. ఆ తర్వాత మూవీస్ తోనూ హిట్టు జోరు కొనసాగించాడు. బోయపాటితో కలసి అఖండ సీక్వెల్ తో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ కాంబోలో వచ్చిన మూవీస్ అన్నీ సూపర్ హిట్టవడంతో అంఖడ సీక్వెల్ పైనా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ జోనర్లో గతంలో చిరంజీవి అంజి మూవీలో నటించాడు. ఆ మూవీ విజువల్ వండర్ అనిపించినా..ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు వశిష్ఠ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో విశ్వంభర నిర్మిస్తోంది. ఈ మధ్యే షూటింగ్ ప్రారంభమైంది. ఈ రెండు సినిమాలూ సరికొత్త ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాయి. మరి పోటాపోటీగా వస్తున్న సోషియో ఫాంటసీ మూవీస్ లో ఎవరు ఫస్ట్, ఎవరు తర్వాతో వెయిట్ అండ్ సీ…