ఏపీలో ఆరు లోక్ సభ సీట్లలోనూ బీజేపీ విజయం – మైయాక్సిస్ సంచలనం

ఏపీలో బీజేపీ పోటీ చేసిన ఆరు లోక్ సభ సీట్లలోనూ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. 95 శాతం కచ్చితత్వం ఉన్న ఎగ్జిట్ పోల్ గా పేరు పొందిన మై యాక్సిస్ సంస్థ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత రోజు పూర్తి స్థాయి విశ్లేషణ చేసింది. ఇందులో బీజేపీ ఆరు స్థానాల్లో గెలవడం ఖాయమని విశ్లేషించింది.

సిట్టింగ్ స్థానాల్లో ఒక్కటే నిలబెట్టుకోనున్న వైసీపీ

సిట్టింగ్ స్థానాల్లో వైసీపీ ఒక్కటే నిలబెట్టుకోనుందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణలో మై యాక్సిస్ స్పష్టం చేసింది. అంటే అది కడప లేదా అరకు అయ్యే అవకాశం ఉంది. ఆ రెండు చోట్ల వైసీపీకి బలం ఉంది. అయితే బీజేపీకి ఆరు సీట్లు వస్తాయని చెబుతున్నందున అరకులో గెలిచే అవకాశం లేదు. అరకులో బీజేపీ గెలిచింది కాబట్టి .. వైసీపీ ఓడిపోతుంది. వైసీపీ కడపలో మాత్రం గెలపొందే అవకాశం ఉంది.

భారీగా బలం పుంజుకున్న బీజేపీ

తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించబోతోంది. ఏపీలోనూ అదే స్థాయి వేవ్ ఉందని ఫలితాలతో స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్ లెక్కల్లో కొన్ని అంచనాలు తారుమారు అయినా ఐదు సీట్లలో గెలవడం ఖాయం అనుకోవచ్చు. అంటే ఎలా చూసినా.. బీజేపీ ఎవరూ ఊహించని విధంగా బలపడినట్లే. ఫలితాల తర్వాత బీజేపీ.. ఏపీలో తనదైన వ్యూహం అమలు చేసే ఉంది.

అసెంబ్లీ కన్నా లోక్ సభలోనే ఎక్కువ బలం

యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే.. వైసీపీకి సున్నా నుంచి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది.అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ . కానీ అసెంబ్లీకి వచ్చే సరికి వైసీపీకి బలమైన స్థానలు రాబోతున్నాయి. 55 నుంచి 77 వరకూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే కూటమిలో బీజేపీకే ఎక్కువ సానుకూలత ఉందని అర్థం చేసుకోవచ్చు.