ఉత్తర భారతంలో బీజేపీ స్వీప్.. మళ్లీ ఖాయం.!

ఉత్తర భారతం లో భాగమైన ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌, యూపి, ఉత్తరాఖండ్‌ లో తిరుగులేని విజయాలను బీజేపీ నమోదు చేసింది. మొత్తం 119 ఎంపిల్లో బిజెపికి 98 స్థానాలను గెలుచుకుంది. అంటే 80 శాతానికిపైగా ఎంపీ స్ధానాలను గెల్చుకుంది. ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీల్లో క్లీన్ స్వీప్ చేసింది. యూపీలో ఉన్న మొత్తం 80 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి 64 బీజేపీ కైవసం చేసుకుంది. మధ్యభారత్ గా చెప్పుకునే మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌ 40 మంది ఎంపిల్లో 37 మంది బిజెపికి చెందిన వారు అంటే 92 శాతం ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభు్తవమే ఉంది. కర్ణాటక ఓటమి తర్వాత దక్షిణాదిలో బిజెపి ప్రభుత్వం లేదు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 130 మంది లోక్‌సభ ఎంపీలు వచ్చారు. వీరిలో బిజెపికి 29 మంది అంటే 22 శాతం ఉన్నారు. అసలు దక్షణాదిలో ఉనికే లేదని చెబుతున్న వారికి ఈ లెక్కలు కనిపించవు. వీరిలో కర్ణాటక నుంచి 25 మంది, తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీజేపీ.. పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేసింది బీజేపీ.