బీజేపీ ఇచ్చే షాక్ అలాగే ఉంటుంది – కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ !

కాజీపేటకు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌ అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదో తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. వరంగల్ ప్రాంత ప్రజల ఉపాధి అవసరాలు, ఆర్థికాభివృద్ధి రైల్వేల సరకు రవాణా కోసం మరిన్ని వ్యాగన్ల అవసరం నిమిత్తం కేంద్రం దీనిని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మార్చినట్లుగా చెబుతున్నారు. మొదటి సంవత్సరం 1200 వ్యాగన్లు … రెండో సంవత్సరం – 2400 వ్యాగన్లు తయారు చేస్తారు. అధిక సైడ్ వాల్స్, ఎండ్ వాల్స్ తయారీ, వీల్ షాప్, పెయింట్ షాప్ సామర్థ్యంపై ఆధారపడి పెంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

భూమి కేటాయించడంలో తెలంగాణ సర్కార్ ఆలస్యం

కాజీపేటకు మంజూరైన రైల్వే వ్యాగన్ రిపేరింగ్ వర్క్‌షాప్ షెడ్ల నిర్మాణానికి గతంలో రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర సర్కారు ఇక్కడ రైల్వే వ్యాగన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 55 ఎకరాలు కావాలని రైల్వేశాఖ కోరింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అయోధ్యపురం గ్రామ శివారులో దేవాదాయ శాఖకు చెందిన భూమిని కొనుగోలు చేసి రైల్వేశాఖకు అప్పగించింది. కేంద్రం 2016-,17 రైల్వే బడ్జెట్‌లో కాజీపేటలో వ్యాగన్ రిపేరింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్), వ్యాగన్ మ్యాన్యుఫ్యా క్చరింగ్ యూనిట్‌ను నిర్మిస్తామని పేర్కొంది. అందుకు160 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటికే దాదాపు 54 ఎకరాల 32 గుంటల భూమి ఉందని, మరో 105 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పింది.

గతఏడాది చివరిలో భూమి చూపించిన తెలంగాణ ప్రభుత్వం

అయితే భూమి కేటాయించడంలో తెలంగాణ సర్కార్ మీన మేషాలు లెక్కించింది. చివరికి గత 150 ఎకరాల భూమిని 2022 సెప్టెంబర్ 23న రైల్వేశాఖకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. మిగతా 10 ఎకరాల భూమిని తర్వాత అప్పగిస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకూ అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వ హామీతో రైల్వేశాఖ ఆర్వీఎన్‌ఎల్ సంస్థ ఆధ్వర్యంలో 2023 జనవరిలో వ్యాగన్ రిపేరింగ్ వర్క్ షాప్(పిఓహెచ్) ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. పవర్ మేక్ ప్రాజెక్టు కంపెనీ రూ.360 కోట్లతో కోట్ చేసి టెండర్‌ను దక్కించుకుంది. 2025 ఫిబ్రవరిలోపు పనులను పూర్తి చేయాలని టెండర్ షెడ్యూల్‌లో రైల్వే శాఖ పేర్కొంది. ఇప్పుడు కేంద్రం కలను నిజం చేస్తోంది.

బీఆర్ఎస్ రాజకీయ కుట్రలన్నీ పటాపంటాలు

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి స్థలం ఇవ్వకుండా అడ్డం పడింది ఇప్పుడు ఎన్నికలకు ముందు బీజేపీని ఇబ్బంది పెట్టడానికి ఏమీ చేయలేదని చెప్పడానికి ఆఖరి క్షణంలో స్థలం చూపించారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం అంత కంటే వేగంగా స్పందించింది. వ్యాగన్ ప్యాక్టరీని మంజూరు చేసింది. వేగంగా నిర్మాణం పూర్తయి కోచ్‌లు కూడా బయటకు రానున్నాయి.