గ్రౌండ్ లెవల్లో బీజేపీ రేంజే వేరు – తెలంగాణ ఎన్నికల్లో వైరల్ కానీ ఎన్నో విశేషాలు !

తెలంగాణ ఎన్నికల్లో అసలు గ్రౌండ్ రియాలిటీని తెలియచేయడంలో మీడియా, సోషల్ మీడియా ఘోరంగా విఫలమవుతున్నాయి., బాగా డబ్బు చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మీడియా చానళ్లను పంచుకున్నాయి. సోషల్ మీడియా సైన్యాలను పట్టుకుని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లో మాత్రం.. ఆ రెండు పార్టీల పరిస్థితి మరీ గడ్డుగా ఉంది. బీజేపీని విశేషమైన ఆదరణ కనిపిస్తోంది. ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంలేదు.

ఓట్లేసే వారి దగ్గరకు నేరుగా బీజేపీ

భారతీయ జనతా పార్టీ ప క్కా వ్యూహంతో ప్రచార బరిలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్లు ప్రచారం చేసుకోవడం వల్ల.. నెటిజన్లకు వినోదం తప్ప పార్టీకి ఓట్లు తెచ్చి పెడతాయన్న నమ్మకం లేదు. అదే సమయంలో.. అడ్డామీద కూలీలలతో భారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వల్ల డబ్బు ఖర్చు తప్ప.. అదనంగా ఓట్లు రావు. అన్ని పార్టీల మీటింగ్‌లకూ వాళ్లే వెళ్తారు. ఇలాంటి వాటిని ఎవాయిడ్ చేసి పూర్తిగా.. జీనియన్ ఓటర్లను ఆట్టుకునేందుకు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ ప్రకారం పని చేసుకుంటూ వెళ్తోంది.

క్షేత్ర స్థాయి ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ

అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇంటింటా ప్రచారం చేస్తున్నాయి కానీ బీజేపీ ఏడాది కిందటే ఈ ప్రచారాలను ప్రారంభించింది. ఆరెస్సెస్ ఫుల్ టైమర్స్ ఇప్పటికే శక్తికేంద్రాల వారీగా ఓటర్లను ఒకటికి రెండు సార్లు కలిసి మోదీ ప్రభుత్వ విజయాలను.. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్లస్ పాయింట్లను వివరించారు. అభ్యర్థుల మీద ఆధారపడకుండా.. పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ ఇలాంటి వ్యూహాలను పాటిస్తుంది. అసలు పార్టీ బలపడటం అంటే ఇదే. అభ్యర్థుల బలం తోడైతే.. బీజేపీ సులువుగా విజయం సాధిస్తుంది. అభ్యర్థిపైనే ఆధారపడటం అనేది బీజేపీ వ్యూహాల్లో ఉండదు.

నేరుగా ఓటర్లను కలుస్తున్న బీజేపీ పార్టీ నియమించిన కేంద్ర కమిటీలు

మరో వైపు వైపు బీజేపీ కేంద్ర కమిటీ నియమించిన సభ్యులందరూ వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడిక్కడ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. మోదీ ప్రభుత్వ విజయాలు.. .బీసీ సీఎం నినాదంతో పాటు… బీజేపీ వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తూంటే… మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా గ్రౌండ్ రియాలిటీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.