ఆశలు తీరుస్తారని అధికారమిస్తే అడ్డగోలుగా దోపిడీ చేసుకోవడానికి ఇచ్చిన లైసెన్స్ లాగా అధికారాన్ని వాడుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, దోపిడీదారులుగా మారిన ఆ పార్టీ నేతలపై బీజేపీ “చార్జ్” ప్రారంభించింది. నాలుగేళ్ల పాలనలో వైసీపీ నేతలు చేసిన తప్పులన్నింటినీ చార్జిషీట్ల రూపంలో ప్రజల ముందు.. అలానే నేరాల్ని పోలీస్ స్టేషన్లలోనూ నమోదు చేయడానికి సిద్ధమయింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వైసీపీ పాలన దురాగతాలను ఎక్కడికక్కడ చార్జిషీట్ల రూపంలో ప్రజల ముందు ఉంచడానికి బీజేపీ కార్యకర్తలు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటికే నాలుగు రోజుల పాటు వీటి కోసం అవసరమైన సమాచారం అంతా సేకరించారు. క్షేత్ర స్థాయిలో వైసీపీ పాలనలో ఎంత దారుణమైన దోపిడీ జరిగిందో.. ఎన్ని సహజ వనరులు దోపిడికి గురయ్యాయో తెలిస్తే ప్రజలంతా ఆశ్చర్యపోతారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో చేసింది విధ్వంసం అన్న విషయం బీజేపీ క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది. పథకాల పేరుతో వేయి ఇస్తే.. వివిధ రకాల పన్నుల పేరుతో పది వేల వరకూ ఏడాదికి వసూలు చేయడమే కాదు.. ఆయా మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న ఉపాధిని దెబ్బతీసింది. రాష్ట్రంలో అత్యధిక మధ్యతరగతి కుటుంబాలు నిరుపేదలుగా మారాయి. ఇలాంటి వాటిని చార్జిషీట్లలో బయట పెట్టబోతున్నారు.
వాలంటీర్లు, వైసీపీ కిందిస్థాయి నేతల చేసిన అరాచకాల గురంచి ప్రజలు బీజేపీ నేతలకు వివరించినప్పుడు.. ఇన్ని ఘోరాలు చేస్తూంటే.. వ్యవస్థలు ఏమైపోయాయా అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వాలంటీర్కు నచ్చకపోతే పథకాలు రాత్రికి రాత్రి ఆపేయడం ఏమిటన్నది ఇప్పటికీ అర్థం కాని విషయం. అసలు వాలంటీర్కు ఉన్నఅధికారలేమిటి.. ఓ పథకం ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఎలాంటి రూల్స్ ఉండవా ?. ఇలాంటి వాలంటీర్ల బాధితులు కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతి ఒక్క బాధితుడు కూడా బీజేపీ వైపు నుంచి ప్రభుత్వంపై చార్జిషీట్ దాఖలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
చార్జిషీట్ కు అవసరమైన సమాచారం కోసం .. గ్రామాల్లోకి, ఊళ్లోకి వెళ్లిన బీజేపీ నేతలకు ఎక్కడిక్కడ సహజ వనరుల దోపిడీ కనిపించింది. నీరు, మట్టి, కొండలు, గుట్టలు దేన్నీ వదల్లేదు. అసలు విషాదం ఏమిటంటే అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వుకుపోవడమే ఎక్కువగా కనిపించింది. ఈ దోపిడీ ఎవరి స్థాయిలో వారు చేస్తున్నారు. కింది స్థాయి వైసీపీ నేత నుండి ప్రభుత్వ పెద్దల స్థాయిలో జరుగుతున్న దోపీడీపై చార్జిషీట్లు దాఖలు చేసేందుకు పూర్తి సమాచారం ఇప్పటికే సేకరించామన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి ఇస్తామన్న..చేస్తామన్న హామీల్లో కనీసం పది శాతం కూడా నేరవేర్చలేదు. రైతుభరోసా రూ. పన్నెండున్నర వేలు ఇస్తామని..రూ. ఏడున్నర వేలే ఇస్తూ..మిగతా కేంద్రం ఇచ్చే నిధుల్ని లెక్క చూపించడం దగ్గర్నుంచి అసలు సంక్షేమ పథకాల్లో ఉన్న డొల్లతనాన్ని బయట పెడతాం. కేంద్రం ఇచ్చే నిధుల్ని మాత్రమే రాష్ట్రం ఇవ్వగలగుతోంది. రాష్ట్ర ఆదాయం మొత్తం అవినీతికే పోతోంది. అంతే కేంద్ర నిధుల్ని కూడా మళ్లిస్తోంది. విపత్తులు వచ్చినప్పుడు రైతులకు ఇవ్వాల్సిన విపత్తు నిధిని వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇవ్వలేదు. ఇప్పుడు రైతుల్ని గాలికొదిలేసింది. ఇలాంటి ఘోరాలైప చార్జ్ చేయకుండా ఎలా ఉంటామని ప్రశ్నించార.ు
ప్రభుత్వం అప్పులు చేయలేకపోతే మనలేని స్థితికి చేరిపోయింది. ఒక్కో వ్యక్తిపై దాదాపుగా రూ. ఐదు లక్షల వరకూ అప్పు పెట్టింది ప్రభుత్వం. ఆ అప్పులు తెచ్చిన లక్షల కోట్లు ఏం చేశారో ఎవరికీ చెప్పడం లేదు. దోపీడీ చేసేశారు. ఇవన్నీ పన్నుల రూపంలో ప్రజలే కట్టాలనే విషయాన్ని చార్జిషీట్ల రూపంలో ప్రజల ముందు ఉంచడానికి బీజేపీ ఏ మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. వికేంద్రీకరణ పేరుతో మొత్తం కేంద్రీకృతమైపోయింది. అవినీతి వ్యవస్థీకృతం అయిపోయింది. చివరికి తెలుగు భాషకు కూడా కులం, మతం అంటగట్టి .. సంస్కృతి, సంప్రదాయాలను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మనుషులకు కాకుండా కాలనీకే మత మార్పిళ్లు చేసేస్తున్నారు. ఇలాంటి దారుణాలన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామన్నారు.
వైసీపీ నేతలు అధికార గర్వంతో పాల్పడిన నేరాలు, ఘోరాలకు లెక్క లేదు. వీటన్నింటిని ఆధారాలతో సహా…బాధితుల ద్వారానే చార్జిషట్ల ద్వారా పోలీసులకు .. స్టేషన్లలో ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ అరాచకాలు, నిర్వాకాలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ పోరాటానికి ప్రజలు సాయం చేస్తున్నారు. సమాచార సేకరణలో వారు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో మేలు చేసింది. మా ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు. ప్రజా ఉద్యమంగా.. చార్జిషీట్ల పోరాటంతో ప్రభుత్వంపై చార్జ్ చేసి.. అధికార మదాన్ని అణిచివేస్తామని స్పష్టం చేశారు.