జనసేన పార్టీ ఎన్డీఏ సమావేశానికి వెళ్లిన అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. పాత మిత్రుడే అయినప్పటికీ చంద్రబాబుకు బీజేపీ నంచి ఆహ్వానం రాలేదు. ఆయన ఎన్డీఏలో చేరడానికి సిద్ధమేనని చెబుతున్నప్పటికీ ఆహ్వానం పంపకపోవడంతో… వచ్చే ఎన్నికల్లో బీజేపీ – జనసేన కూటమిగా పోటీ చేస్తాయని క్లారిటీ వస్తోంది. ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన ్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ – జనసేన కలిసే ఉంటాయని హైకమాండ్ సందేశం
బీజేపీ – జనసేన కలిసి లేవన్నట్లుగా ఏపీలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ దుష్ప్రచారాన్ని చెరిపేసే విధంగా రాష్ట్రంలో నూతన కార్యచరణ చేపట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. బిజెపి పవన్ కు సంబంధం లేదని ప్రచారం చేశారని.. 18 న ఎన్డీఎ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అహ్వానించారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. బిజెపి..జనసేన పై తప్పుడు ప్రచారం చేసిన వారికి ఈ పిలుపు ఒక కనువిప్పని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన బిజెపి బలమైన రాజకీయ శక్తిగా రాబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. వాలంటీర్ల పై వపన్ వ్యాఖ్యలపై హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని మంత్రుల్ని స్పందించారు. పవన్ మాట్లాడిన పది అంశాల్లో ఒక్క అంశం పైనే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఏపీలో బలోపేతం కోసం ఉద్యమాలు
ఏపీలో బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని.. విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి సొంతంగా ప్రజా ఉద్యమాలు చేస్తుందని స్పష్టం చేశారు. .పొత్తులు వేరు…ప్రజా ఉద్యమాలు వేరని గుర్తుచేశారు. వారాహి పవన్ రాజకీయంగా సొంత యాత్ర , దానిని స్వాగతిస్తూన్నామన్నారు. మాకు జనసేనకు రాజకీయ వ్యూహం ఉందని దాని ప్రకారమే ముందుకు వెళ్తామంటున్నారు. 2024 ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేలా సమావేశంలో చర్చించామని… ప్రజాక్షేత్రంలో వైసిపి పాలనపై ప్రజాచార్జి షీట్ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. వైసిపి ఎన్నికల హామీలను 90 శాతం విస్మరించారని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పురందేశ్వరి పర్యటనలు
రాష్ట్రంలో పురంధేశ్వరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. 23 న రాయలసీమ, 25 న కోస్తాంధ్ర, 26 న రాజమండ్రి లో, 27 న విశాఖలొ ముఖ్యనేతల సమావేశం లో పురంధేశ్వరి గారు పాల్గొంటారు. ఎపిలో ఇసుక విధానంపై ఒకే సంస్ధకు కేటాయించడం మానవ వనరులను జాతి సంపదను హరించడమేనని ఎన్జీటీ చెప్పిందని.. టిడ్కో ఇల్ల లో మిగులు భూమైన 260 ఎకరాల భూమిని గుర్తించి 750 కోట్ల నిధులు సేకరించేందుకు వైసిపి ప్రభుత్వం యత్నించడం దుర్మార్గమని బీజేపీ తేల్చింది. పేదలు భూములను అమ్మే ప్రక్రియను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పేదల సొమ్ముతో వారి రక్తాన్ని తాగుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ ఉద్యమాల్లో భాగం కాబోతున్న జనసేన ?
ఎన్డీఏ మీటింగ్ లో .. ఏపీలో .. ఎలా ఉమ్మడి ఉద్యమాలు చేయాలన్నదానిపై పవన్ కు ఓ రూట్ మ్యాప్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దానికి పవన్ సిద్ధమైతే.. బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏపీలో రాజకీయం మారిపోయే అవకాశం ఉంది.