టీడీపీ 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం లేదు.. బీజేపీ, జనసేన పార్టీతో కలిసి 175 స్థానాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి .. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు బీజేపీ తీసుకోబోతుందని పేర్కొన్నారు.. రాయలసీమకు సంబంధించిన చంద్రబాబు, వైఎస్ జగన్.. రాయలసీమను మోసం చేశారని విమర్శించారు.. మేం అధికారంలోకి వస్తే రాయలసీమ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.. అయితే, ఏపీలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు.. టీడీపీ తమ నాయకులను పోటీలో పెట్టడానికి వెనాకాడుతుందన్న ఆయన.. టీడీపీ.. వైసీపీని ఎదురుకొనే స్థాయి లో లేదు.. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు.
Related Posts
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…
బీజేపీ కూటమిలోకి వచ్చినప్పుడే విజయం – ఏపీ ఫలితాలు చెప్పింది ఇదే
చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో…
పథకాల కన్నా ఎక్కువ నష్టం చేసింది అధికార దుర్వినియోగమే – ఆ తప్పును గుర్తించలేకపోయిన వైసీపీ !
2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని…