వైసీపీ సర్కార్‌ ఉక్కిరి బిక్కిరి – ముప్పైట దాడి చేస్తున్న బీజేపీ, జనసేన, టీడీపీ !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మూడున్నరేళ్ల వరకూ ఓ లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏం చేసినా చెల్లుతుందనే రాజకీయ వాతావరణం ఏర్పడింది. దాన్ని ఆ పార్టీ ఎలా ఉపయోగించుకుందన్న సంగతిని పక్కన పెడితే… రాజకీయంగా మాత్రం ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ ఇప్పుడు బీజేపీ తో పాటు జనసేన, టీడీపీ లు కూడా రోడ్డెక్కడంతో సీన్ మారిపోయింది.

విస్తృతంగా ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తున్న బీజేపీ

ఏపీ బీజేపీ ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో విస్తృతంగా ఉద్యమాలు చేస్తోంది. ప్రజా చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇటీవల పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై రోడ్డెక్కింది. కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా ఉంటూ… వైసీపీ రాష్ట్రంలో పొలిటికల్ గేమ్ ఆడి.. బీజేపీని బలహీనం చేయాలన్న ప్రయత్నం చేసింది. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం.. వైసీపీ చర్యల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. పంంచాయతీ నిధుల దారి మళ్లింపుపై ఇప్పటికీ సమాధానం చెప్పలేకోయారు.

వారాహి యాత్రలో జనంలో జనసేన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు విసాఖలో జరుగుతోంది. ప్రతీ సందర్భంలోనూ ఆయన ప్రభుత్వ వైఫల్యాల్ని బయట పెడుతున్నారు . దీంతో సమాధానం చెప్పుకోలేక వైసీపీ తంటాలు పడుతోంది. ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడంతో ప్రజల్లోనూ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రోజుకు నలుగురు, ఐదుగురుమంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయాల్సి వస్తోంది. బీజేపీ, పవన్ లేవనెత్తిన అంశాలపై ఎదురుదాడి చేస్తున్నారు కానీ.. ఎజెండా విపక్షాలు సెట్ చేస్తే వైసీపీ వివరణ ఇచ్చుకున్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

చంద్రబాబు, లోకేష్ యాత్రలు !

చంద్రబాబు లోకేష్ కూడా ప్రజల్లో ఉటున్నారు. వారు కూడా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు విరుచుకుపడుతూండటంతో వైసీపీకి గడ్డు కాలం ఎదురవుతోంది. ఇలా ఎందుకు మారిపోయిందో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. రోజూ విపక్షాలు ఆరోపణలు చేయడం.. తాము వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో.. పొలిటికల్‌గా ఫిక్స్ అయ్యామన్న అభిప్రాయంతో వైసీపీ నేతలున్నారు. విపక్షాలన్నీ ప్రస్తుతానికి విడివిడిగా ఉద్యమాలు చేస్తున్నాయి. కలిసి ఉద్యమం చేస్తే పరిస్థితి మారిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.