బౌద్ధానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్న బీజేపీ

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బీజేపీపై రోజువారీగా నాలుగైదు ఆరోపణలు చేస్తారు. ఇటీవల ఆయన మత సామరస్యం, అన్ని మతాలకు ప్రాధాన్యమనే అంశంపై అక్కడక్కడా మాట్లాడుతున్నారు. స్వతహాగా బౌద్ధ మతస్తుడైన ఖర్గే.. ఎన్డీయే పాలనలో తమ మతాన్ని పక్కన పెట్టేశారని, పూర్తిగా విస్మరించారని ఆరోపణలు సంధించారు. బౌద్ధులను చిన్న చూపు చూస్తున్నారని ఆయన అన్నారు. దానిపై బీజేపీ నేతలు గట్టి సమాధానం ఇస్తున్నారు. బౌద్ధ మతస్తులు సైతం ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో ఖర్గే ఇప్పుడు ఇరకాటంలో పడిపోయారు…

గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిటి నిర్వహణ

బుద్ధుడు విష్ణుమూర్తి తొమ్మిదో అవతారమని చెబుతారు. దేశంలో బౌద్ధులు మైనార్టీ మతమైనా వారికి హిందువులతో సమానంగా హక్కులు కల్పిస్తున్నారు. మోదీ ప్రభుత్వం 2023లో తొలి బుద్ధిస్ట్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది.అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనాల ద్వారా అనేక కార్యక్రమాలు జరిపిస్తోంది. బౌద్దుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత ప్రచారమిస్తోంది……

చారిత్రక ప్రదేశాల అభివృద్ధి…

గౌతమ బుద్ధుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బౌద్ధుల సాహిత్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. బుద్ధుడి చరిత్రతో సంబంధమున్న ప్రదేశాలను (బుద్ధిస్ట్ సర్క్యూట్) జనం వీక్షించేందుకు వీలుగా పర్యాటకాభివృద్ధికి ఏర్పాట్లు చేస్తోంది. బౌద్ద పర్యాటకానికి, ఆయా ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోంది. దేశ,విదేశ పర్యాటకులు బౌద్ధారామాలను సందర్శించేందుకు వీలుగా కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. కుషినగర్ ప్రాంతానికి దగ్గరగానే గౌతముడు మహాపరినిర్యాణం చెందారు.

బుద్ధుడి ప్రవచనాలను విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం

లుంబినిలో భారత అంతర్జాతీయ బౌద్ధ సంస్కృతీ, వారసత్వ కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వాదనగర్ ప్రాంతానికి యుునెస్కో వారసత్వ కేంద్రం స్థాయి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. బౌద్ధుల పవిత్ర గ్రంధాలను మంగోలియాకు కూడా తీసుకు వెళ్లారు. అలాగే థాయ్ లాండ్ కు కూడా బౌద్ధ సాహిత్యాన్ని చేర్చడంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. బౌద్ధాన్ని ప్రోత్సహించే దిశగా వైశాఖ పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ, అభిధమ్మ దినోత్సవాలను నిర్వహించారు.బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా బుద్ధ పూర్ణిమ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2019లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మోదీ మాట్లాడుతూ బౌద్ధమతంపై ప్రత్యేక ప్రస్తావన చేశారు. మరో పక్క భారతీయ బౌద్ధ సంఘ్ అధ్యక్షుడు భాంటే సంఘ్ ప్రియా రాహుల్ కూడా ఖర్గే వ్యాఖ్యలను తప్పుపట్టారు. అధికానికి వచ్చిన వెంటనే 2014లో ప్రధాని స్వయంగా బుద్ధ జయంతి వేడుకలకు హాజరైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుజరాత్ అసెంబ్లీలో బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కూడా ఆయన ప్రస్తావించారు.