తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే – జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ దిశానిర్దేశం !

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. బీఎల్ సంతోష్ మాట అంటే ఎలా ఉంటుందో పార్టీ నేతలకు తెలుసు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందని పార్టీ నేతలకు నమ్మకం ఉంది. గట్టి ప్రణాళికలు లేకపోతే ఆయన అలా చెప్పరని బీజేపీ నేతలకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ చేసిన దిశానిర్దేశం ప్రకారం పార్టీ నడిస్తే.. మిగతాది కేంద్ర పార్టీ చూసుకుంటుందన్న నమ్మకం పార్టీ నేతల్లో ఏర్పడింది.

గ్రామ స్థాయిలో ప్రచారానికి దిశానిర్దేశం

బీజేపీ నేతలంతా గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు. మేడ్చల్ లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పదో తరగతి క్వశ్చన్ పేపర్, టీఎస్ పీఎస్సీ లీకేజీలకు పాల్పడిన ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది యువత జీవితాలు ఆగమయ్యాయని నడ్డా ఆవేదన వ్యక్తంచేశారు. రజాకార్లతో చేతులు కలపడానికి కేసీఆర్ సిగ్గుండాలి అని నడ్డా ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని స్పష్టం చేసారు. ప్రధాని మోడీ నేతృత్వంలోనే దేశం అగ్రగామిగా నిలిచిందని నడ్డా తెలిపారు. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్‌లో 13 కోట్ల మంది పేదరికాన్ని జయించారని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఎందుకు అబివృద్ధి చేయలేదని నడ్డా ప్రశ్నించారు.

గడప గడపకూ తెలంగాణకు బీజేపీ చేసిన మేలు

తెలంగాణలో బీజేపీ గెలవాలని, మరోసారి కేంద్రంలోనూ అధికారంలోకి తీసుకురావాలని నడ్డా దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించాలని నడ్డా సూచించారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ప్రజా సంక్షేమం పట్టని సీఎం కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని నడ్డా ముఖ్య నేతలకు సూచనలు చేశారు. తెలంగాణ ముఖ్య నేతలతో పాటు ఎన్నికల కోసం నియమించిన కేంద్ర కమిటీ సభ్యులూ హాజరయ్యారు. పీఎం అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను కేంద్రం నిర్మించిందని, మరి తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారా? అంటే అదేం లేదనే సమాధానం వస్తుంది. అరకొరగా నిర్మించి పేదలకు వాటిని చూపించి మోసం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతుల అకౌంట్‌లో కేంద్రం డబ్బులు జమ చేస్తోందని, ఇందులో 38.50 లక్షల మంది తెలంగాణ రైతులు ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణకు మోడీ ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించాలని అగ్రనేతలుదిశా నిర్దేశం చేశారు.

నడ్డా, బీఎల్ సంతోష్ మాటలతో మరింతగా పెరిగిన నమ్మకం

తెలంగాణలో ఇప్పటి వరకూ కంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చాన్స్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కాస్తా ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ అయింది. కానీ బీజేపీకి మాత్రం ఎప్పుడూ పరిపాలన చేసే అవకాశం రాలేదు. తెలంగాణ ప్రజల్లోనూ ఇదే అభిప్రాయం కనిపిస్తోంది. వాళ్లు కాకపోతే వీళ్లు.. వీళ్లు కాకపోతే వాళ్లు అనే పరిస్థితి ఎందకని.. ఈ సారి బీజేపీకి చాన్సివ్వాలన్న అభిప్రాయం బలపడుతోంది. దీ్ని పార్టీ నేతలు మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.