ఉత్తదే… కర్ణాటక ప్రచారానికి పవన్ ను పిలువని బీజేపీ !

కర్ణాటకలో బీజేపీ ప్రచారానికి పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ నేతలు సంప్రదించారన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఆయనకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు దక్కలేదు సరి కదా..కనీసం సంప్రదింపులు కూజా చేయడం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు ఓటర్లపై పవన్ ప్రభావం ఉంటుందని ఆయనతో బీజేపీ నేతలు ప్రచారం చేయిస్తారని అనుకున్నారు. కానీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు.

కర్ణాటకలో బీజేపీ తరపున బ్రహ్మానందం ప్రచారం

కర్ణాటకలో చిక్ బళ్లాపూర్ లో బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. సుధాకర్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ వ్యక్తిగత పరిచయంతో వచ్చి ప్రచారం చేశారు. ఆయనకు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చిక్ భళ్లాపూర్ లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇప్పటికే ఏపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వం ఓ టీం ఆ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఇక పార్టీ తరపున కిచ్చా సుదీప్, సుమ‌ల‌త , దర్శన్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ పవర్ స్టార్ ను పిలువలేదు !

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా క‌ర్ణాట‌క‌లో బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తార‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువుగా నివ‌సిస్తున్న ప్రాంతాల్లో జ‌న‌సేనానికితో ప్ర‌చారం చేయిస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని క‌ర్ణాట‌క బీజేపీ నేత‌లు భావించారని అనుకున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్ప‌టికీ అటువంటిది ఏదీ క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికి రార‌ని స్ప‌ష్టంగా ఎక్క‌డా ఓ ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌లేదు. అటు బీజేపీ నుంచి గాని.. ఇటు జ‌న‌సేన నుంచి గానీ ఎటువంటి స్పంద‌న రాలేదు. దీంతో క‌ర్ణాట‌కలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం ఉండ‌ద‌ని తేలిపోయింది.

రాజకీయ వ్యూహాలపై క్లారిటీ లేని పవన్

క‌ర్ణాట‌క‌లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. వారి ఓట్లు కూడా ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయి. 12 జిల్లాల్లో 40 నియోజ‌క వ‌ర్గాల్లో తెలుగు ప్ర‌జ‌ల ఓట్లు కీల‌కం కానున్నాయి. వారు ఎటు వైపు మొగ్గుచూపురాన‌నే విష‌యంపై ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆధార‌ప‌డ‌తాయి. ప్ర‌స్తుత ఎన్నికల్లో కొన్ని వేల ఓట్లు ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తారు మారు చేయ‌గ‌ల‌వు. ఇటువంటి నేప‌థ్యంలో జ‌న‌సేనాని సేవ‌లను బీజేపీ వినియోగించుకుంటాద‌ని అంద‌రూ భావించారు. కానీ పవన్ కల్యాణ్ రాజకీయ అస్పష్టతపై బీజేపీ హైకమాండ్ అసంతృప్తిగా ఉండటంతో ఆయనను సంప్రదించకపోవడమే మంచిదని భావించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం త‌మ‌తో వ‌చ్చేవారిని ఆహ్వానిస్తున్నారు త‌ప్ప బెట్టు చేసే వారి గురించి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.