బోథ్‌లో బీజేపీ బోణి ఖాయం – ఇదీ అక్కడ పరిస్థితి !

బోథ్ నియోజకవర్గం: ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన బోథ్ నియోజకవర్గంలో గిరిజన ఓటర్లు అత్యదికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆదిలాబాద్ జిల్లాలో బిజెపి ఖాతా తెరిచిన తొలి నాయకుడిగా సోయం బాపురావ్ చరిత్రలో నిలిచిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి రికార్డు తిరిగరాయాలని అనుకుంటున్నారు.

తుడుందెబ్బ నాయకుడిగా ఎదిగిన సోయం బాపూరావు

ఉపాధ్యాయుడుగా పనిచేసిన సోయం బాపురావ్ 2009లో రాజకీయం ప్రారంభించి, తుడుం దెబ్బ ఉద్యమ నేతగా ఎదిగారు. 2009లో బోథ్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆపై ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 లో మళ్లీ టిడిపి పార్టిలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో మళ్ళీ కాంగ్రెస్ లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బిజెపి పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. ఆదివాసి ఉద్యమ నాయకుడిగా అంచలంచలుగా ఎదిగిన ఆయనకు ఆదిలాబాద్ ఎంపీగా ప్రజలు అవకాశం కల్పించారు. ఎంపీగా సోయం బాపురావ్ భారీ మెజారిటీతో గెలిచారు. జిల్లాలో బిజెపి ఖాతాను తెరిచిన తోలి నాయకుడిగా సోయం బాపురావ్ చరిత్రలో నిలిచిపోయారు. ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి బరిలో దిగారు.

బాపూరావుకు ప్రజల అండ

బోథ్ నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. ఎంపీగా ఆయనకున్న అనుభవంతో అక్కడ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ సారి బోథ్ నియోజకవర్గంలో బిజెపి కచ్చితంగా గెలువబోతుందన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. నియోజవర్గంలో పర్యటిస్తూ ఆయన తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. పోడు పట్టాల అంశంతో పాటు నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి గురించి అధికార పార్టీపై ఘాటూ వ్యాఖ్యలు చేస్తూ నియోజకవర్గంలో తన గెలుపే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నారు.

త్రిముఖ పోటీలో బీజేపీ ముందంజ

బోథ్ నియోజకవర్గంలో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ గట్టిగా కనిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అనిల్ జాదవ్ బరిలో ఉన్నారు. జాదవ్ అనిల్ రాజకీయంగా ఈయన గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై నేరడిగొండ జడ్పీటిసి గా గెలుపొందారు. జడ్పీ చైర్మన్ పదవి ఆశించిన ఆయనకు ఎమ్మేల్యే టికెట్ ఇస్తామని చెప్పడంతో కేటీఆర్ కు సన్నిహితుడయ్యారు. చెప్పిన మాట ప్రకారం ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడే గజేందర్ బరిలో నిలిచారు. ఆడే గజేందర్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్నేళ్లు గా పనచేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎంపీ బాపూరావు బలంగా కనిపిస్తున్నారు.