రెండు రోజుల పాటు ఢిల్లీలో జీ 20 సమావేశాలు జరిగాయని తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసా ?. సోషల్ మీడియా, మీడియా ద్వారా వార్తలు తెలుసుకునే ఎవరికీ తెలియదు. ఎందుకంటే జీ 20 వార్తలు ఎవరికీ కనిపించలేదు. అమెరికా అధ్యక్షుడు ఇండియాలో అడుగు పెట్టారన్న సంగతి తెలిసింది కానీ తర్వాత ఏం చేశారో… ప్రధానితో ఏం మాట్లాడారు.. దేశానికి ఏం గుడ్ న్యూస్ చెప్పారు… మనోళ్లకు గ్రీన్ కార్డులు పెంచుతారన్నారా లాంటి కబుర్లు ఎక్కడా కనిపించలేదు. ఆయన వెళ్లిపోయిన విషయాన్నీ పట్టించుకోలేదు. అమెరికా అధ్యక్షుడ్నే పట్టించుకోలేదంటే.. ఇక నలభై దేశాల అధ్యక్షులు వచ్చారని తెలుస్తుందా ?
జీ ట్వంటీలో భారత్ భారీ విజయాలు
ఉక్రెయిన్ యుద్దానికి ఫుల్‌స్టాప్ పెట్టి ప్రపంచశాంతికి పాటుపాడాలని జీ-20 సదస్సు ఏకగ్రీవ తీర్మానం చేసింది. చారిత్రాత్మక ఇండియా మిడిల్ ఈస్ట్ – యూరోపియన్ ఎకనామిక్ కారిడార్‌కు ఆమోదం తెలిపారు. జీ-20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. ప్రపంచశాంతికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్న ఢిల్లీ డిక్లరేషన్‌కు జీ-20 దేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపాయి. ఢిల్లీ భారత్ మండపంలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ డిక్లరేషన్ ప్రకటించారు. ఢిల్లీ డిక్లరేషన్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఎట్టకేలకు ఏకాభిప్రాయం వచ్చింది. ఇందులో రష్యా ఉన్నప్పటికీ ఇలాంటి తీర్మానం అమోదింపచేయడం… అద్భుతమని …అందరూ ప్రధాని మోదీని అభినందించారు. అలాగే కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు.
దేశం మొత్తం పండుగ వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ?
ఎప్పుడైనా అమెరికా అధ్యక్షుడుఇండియాకు వస్తున్నాడంటే… ఆయన విమానం దగ్గర్నుంచి తినడానికి వాడే స్పూన్ గురించి కూడా కథలు కథలుగా చెప్పేవారు. ఇప్పుడు ఆయననే పట్టించుకోలేదు. కేంద్రం జీ 20 సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వడంపై ఏడాది నుంచి ప్రచారం చేస్తోంది. ప్రపంచంలో తమ దేశాన్ని గొప్పగా నిలబెట్టామని. .. నాయకత్వం వహిస్తున్నామని చెప్పాలనుకుంది. కానీ అసలు ఆ నాయకత్వం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేకుండా పోయింది. జీ 20లో అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. చెబుతామన్నా ఎవరూ పట్టించుకోలేదు. దీనికి కారణం ఏపీలో రాజకీయాలే… మీడియా మొత్తం . ఆ ఘటనకు ప్రయారిటీ ఇవ్వడమే.
మీడియా అజెండాలు మీడియావి !
ఎవరి అజెండా వారిది. అయితే అందరూ తమ వ్యూయర్స్ ను సంతృప్తి పరిచారు. ఎవరి అజెంండా మేరకు వారు వార్తలిచ్చారు. అయితే ఆ అజెండాలో జీ 20 లేకపోవడమే మహా విషాదం. దీనికి మీడియా చెప్పే కారణాలు ఉంటాయి.. ప్రజలు ఏది చూస్తే దాన్నే చూపిస్తామని. అది కూడా నిజమే కావొచ్చు.. చంద్రబాబు మారథాన్ ఎపిసోడ్ కాకుండా.. జీ 20 చూపిస్తే ప్రజలు ఎవరైనా చూసేవాళ్లా ? అని ప్రశ్నిస్తున్నారు. దేశం గురించి ఓ ఘనమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘటనలు ఆస్కారం ఇవ్వకపోవడం ఉత్తమం అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.