కళ్లకింద క్యారీ బ్యాగులు రాకుండా ఉండాలంటే ఇలా చేయడం బెటర్!

చలికాలం, చలిగాలులు మొదలవగానే వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. అయితే శీతాకాలం అయినా కానీ వేడినీళ్లు కన్నా చల్లటి నీళ్లను ఎంపిక చేసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనినే కోల్డ్ వాటర్ థెరపీ అంటారు.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే..

కంటికింద బ్యాగ్ లు తగ్గాలంటే..
కొందరి ముఖం ఉబ్బరంగా అనిపిస్తుంది. పైగా నిద్రలేవగానే మరింత ఉబ్బినట్టు కనిపిస్తుంది. కంటికింద క్యారీ బ్యాగ్ లు, నల్లటి వలయాలు ఇబ్బంది పెడతాయి. అలాంటి వారు కోల్డ్ వాటర్ థెరపీ చేస్తే చాలా హెల్ప్ అవుతుందట. ముఖ్యంగా ముఖంలో చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు ఇదే మంచిది. ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడంతో పాటూ చర్మ ఆరోగ్యాన్ని , రంగుని కూడా మెరుగుపరుస్తుంది. చల్లటి నీళ్లు చర్మాన్ని టైట్ గా ఉంచడం వల్ల యంగ్ లుక్ తో బ్రైట్ గా కనిపిస్తారు.

ఒత్తిడి తగ్గించే ఔషధం
ముఖాన్ని చల్లని నీటితో కడిగితే ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితిని మెరుగుపడుతుంది. ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.కోల్డ్ థెరపీ నాడీ వ్యవస్థపై ప్రశాంత ప్రభావాలను చూపుతుంది, మనసుకు ఓదార్పునిస్తుంది, నిరంతరమైన ఆలోచనల నుంచి తలను చల్లబరుస్తుంది, మిమ్మల్ని మానసికంగా తేలిక చేస్తుంది ఈ రకంగా కోల్డ్ థెరపీ మానసిక చురుకుదనాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

అనారోగ్యంతో ఉన్నవారికి మంచిది కాదు
ఈ కోల్డ్ వాటర్ థెరపీని ప్రాక్టీస్ చేయాలంటే ముఖాన్ని 10 నుంచి 12 సెకన్ల పాటు చల్లని నీటిని చల్లుకోవాలి. ఐస్ క్యూబ్స్‌తో కూడా ప్రయత్నించవచ్చు.
చన్నీటి థెరపీ సున్నితమైన చర్మం ఉన్నవారికి, అనారోగ్యంతో ఉండేవారికి అంత మంచిది కాదని గమనించాలి. ఒకవేళ ప్రయత్నించినా కానీ రెండు మూడు రోజుల్లో మీ చర్మంలో వచ్చే మార్పులను గమనించి వాటిని కంటిన్యూ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి.

ఇంట్లోనే కోల్డ్ థెరపీ

@ కోల్డ్ థెరపీని పొందడానికి మీరు ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో కూడా కోల్డ్ థెరపీ పొందేందొచ్చు. ఒక బాత్ టబ్ లో ఐస్ వాటర్ నింపి అందులో కొంతసేపు సేదతీరవచ్చు. ఇది మీకు సౌకర్యంగా అనిపించకపోతే … నొప్పులు, వాపులు ఉన్నచోట చల్లటి క్యూబ్స్ తో మసాజ్ చేయవచ్చు

@ చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు మాయం అవుతాయి, ప్రశాంతంగా ఉంటుంది.

@ ఐస్ క్యూబ్ లతో శరీరాన్ని 7-10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. కొన్ని ఐస్ క్యూబ్ లను ఒక పేపర్ బ్యాగ్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి మసాజ్ చేయవచ్చు.

@ ప్రత్యేకంగా ఒళ్లు నొప్పులను తగ్గించుకోవడానికి కూలెంట్ స్ప్రేలను ఉపయోగించవచ్చు. వీటిలో మెంథాల్ ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.