చిత్తూరు మీదుగా బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైయిన్ – మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం !

చిత్తూరు మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ రానుంది. కేంద్ర ప్రభుత్వం గాంధీనగర్‌ నుంచి ముంబాయికి బుల్లెట్‌ ట్రైన్‌ పనులు జరుగుతున్నాయి. ఇది దేశంలో మొట్టమొదటి బుల్లెట్‌ ట్రైన్‌ . చెన్నై నుంచి మైసూర్‌కు మరో బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నై నుంచి బెంగళూరు వయా మైసూరు వెళ్లాలంటే సుమారు పది గంటలు సమయం పడుతుంది. బుల్లెట్‌ ట్రైన్‌ పనులు పూర్తయితే చెన్నై నుంచి మైసూర్‌కు సుమారు రెండు నుంచి రెండున్నర గంట సమయం పడుతుంది.

చెన్నై – బెంగళూరు రూట్‌లో చిత్తూరుకు బుల్లెట్ ట్రైన్

ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా ఈ బుల్లెట్‌ ట్రైన్‌ నడపడానికి రైల్వే ఉన్నతాధికారులు ప్రణాళికను రచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇటు కర్ణాటక అటు తమిళనాడు సరిహద్దు కావడంతో ఇటు వ్యాపారంగా అటు విద్య, వైద్య ఎంతోమంది చిత్తూరు జిల్లా వాసులకు బుల్లెట్‌ ట్రైన్‌ రావడంతో ఎంతో సమయం కలిసి రానుంది. చెన్నై హార్డ్‌వేర్‌ రంగంలో అభివద్ధి చెందగా, మైసూరు సాఫ్ట్‌వేర్‌ రంగంలో అభివద్ధి చెందింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఎంతోమంది విద్య వైద్య పరంగాప్రయాణం సాగిస్తూ ఉంటారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఇబ్బందులు అన్ని ఎన్ని కావు. గత రైల్వే బడ్జెట్లో చెన్నై మైసూర్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు తయారు చేశారు.

బుల్లెట్ ట్రైన్‌కు ప్రత్యేక ర్వైల్వే ట్రాక్

. బుల్లెట్‌ ట్రైన్‌ కు ప్రత్యేక రైల్వే ట్రాక్‌ ఏర్పాటు చేయాలని అందుకు తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ పనులు దక్కించుకోవడానికి ఎల్‌ అండ్‌ టి సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చెన్నై మైసూర్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ పనులు ఐదేళ్ల లోపు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుంది. బుల్లెట్‌ ట్రైన్‌ చిత్తూరు మీదుగా వెళ్లడం వల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.మూడు రాష్ట్రాల మీదుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకను కలుపుతూ 340 గ్రామాల మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ రాకపోకలు సాగించేలా అధికారులు డీపీఆర్‌ రూపొందించారు.

గంటలోనే బెంగళూరుకు !

సాధారణంగా చైన్నె నుంచి మైసూర్‌కు రైలులో వెళ్లాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్‌ ట్రైన్‌లో అయితే కేవలం 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ ట్రైన్‌కు చిత్తూరులో స్టాపింగ్‌ ఇవ్వడంతో జిల్లావాసులకు సైతం సేవలందించనుంది.చిత్తూరు స్టాపింగ్‌ మీదుగా…జిల్లాలోని 41 గ్రామాల మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ ప్రయాణించనుంది. ఈ మేరకు 435 కిలోమీటర్ల వరకు 18 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు డిజైన్‌ రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఇప్పటికే శాటిలైట్‌, ల్యాండ్‌ సర్వే పూర్తి చేసింది. 750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ ట్రైన్‌ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లె వద్ద చిత్తూరు స్టాపింగ్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.