Bandi Sanjay: కేటీఆర్‌ రాజీనామా చేయాల్సిందే.. నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్‌ కామెంట్స్‌.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు టీఎస్‌ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ నేపథ్యంలో.. మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో బీజేపీ నిరుద్యోగుల మహాధర్న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం..

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు టీఎస్‌ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ నేపథ్యంలో.. ‘మా నౌకరీలు మాగ్గావాలే’ అనే నినాదంతో బీజేపీ నిరుద్యోగుల మహాధర్న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ బీజేపీ నిర్వహించిన ఈ మహాధర్నాలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు కేటీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ను మెడలు పట్టి బయటకు తోయాలంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

పేపర్‌ లీకేజ్‌ను వ్యవహారంపై సిట్‌తో కాదు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌తోనే మహా ధర్నా చేపట్టినట్టు తెలిపారు. ఇక సిట్ తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన బండి సంజయ్‌..’నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోయారు. ఈ రోజు స్వయంగానే నేనే అధికారులను పిలిచి నోటీసులు తీసుకున్నాను. ఈ విషయంపై నా లీగల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుంది. సిట్ విచారణతో అసలు దొంగలను కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.

ఇక పేపర్‌ లీకేజీలో మొదట ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పిన కేటీఆర్‌.. ఇప్పుడు 20 మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ.. కేటీఆర్‌ రాజీనామా చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి ఇకపై భయమంటే ఏంటో చూపిస్తామంటూ ఫైర్‌ అయ్యారు. తమకు కేసులు, జైళ్లు కొత్త కాదని బండి సంజయ్ సవాలు విసిరారు. ఇక నిరుద్యోగులెవరూ.. ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం మెడలు వంచే దాకా వదిలే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకిస్తుందని బండి సంజయ్‌ తెలిపారు.