విశాఖ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి టీడీపీ తరఫున బాలయ్య చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల అధినేత భరత్ కర్చీఫ్ వేసేశారు. ఆయన చాలా కాలంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. ఆయన ఈసారి కచ్చితంగా గెలుస్తాను అని నమ్ముతున్నారు. గతసారి కూడా కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిన భరత్ ఈసారి వీజయం తనదే అంటున్నారు. కానీ ఆయన త్యాగం చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
విశాఖను పల్లా శ్రీనివాస్‌కు కేటాయిస్తారా ?
పొత్తులో భాగంగా జనసేనకు గాజువాక అసెంబ్లీ టికెట్ ఇస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే గాజువాక మాజీ ఎమ్మెల్యే విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనను ఎక్కడో ప్లేస్ చూపించాల్సి ఉంది. దాంతో పాటు వైసీపీ ఈసారి ఎంపీ అభ్యర్థి విషయంలో బీసీ కార్డుని ప్రయోగిస్తుంది అని అంటున్నారు. దాంతో టీడీపీ బీసీ అభ్యర్ధిగా పల్లా శ్రీనివాసరావును విశాఖ పార్లమెంట్ నుంచి పోటీకి దించవచ్చు అని అంటున్నారు 2009లో పల్లా శ్రీనివాసరావు జనసేన తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి ఓట్లను సంపాదించారు. దాంతో ఆయనకు ఎంపీగా పోటీ చేయడం కొత్త కాదు. పైగా యాదవ సామాజికవర్గం మద్దతు కూడా భారీగా దక్కుతుంది. అది ఎమ్మెల్యే అభ్యర్ధులకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా చాలా లెక్కలు వైసీపీ వేసుకుంటోంది అని
అంటున్నారు.
బాలకృష్ణ కుటుంబం నుంచే మరొకరు పోటీ ?
నిజానికి నందమూరి కుటుంబం నుంచే మరొకరు టిక్కెట్ కోసం పోటీ వస్తున్నారని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ కీలక నేత.. ప్రస్తుతం టీడీపీలో లేరు. అలాగని జనసేనలో లేరు. కానీ ఓ జాతీయ పార్టీలో కీలకంగా ఉన్నారు. పొత్తులు పెట్టుకుని విశాఖ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తాను పోటీ చేయాలని అనుకుటున్నారు. హైకమాండ్ కు ఇష్టం లేకపోయినా ఆమె అందుకే పొత్తులకోసం ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ఈ అంశంపై భరత్ లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని చెబుతున్నారు.
బాలయ్య అల్లుడి కృషి ఎలా చూసినా వేస్టే !
బాలయ్య అల్లుడు ఎంపీ అభ్యర్ధిగా పోటీకి ఎంత ఉత్సాహం చూపుతున్నా పొత్తుల దెబ్బ అటూ ఇటూ గట్టిగానే ఉంది అని అంటున్నారు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తు మీద కొంత సందేహం అయితే ఉంది. అయితే ఆయన మాత్రం టికెట్ నాదే అని పర్యటనలు గట్టిగానే చేస్తున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జిలతో ఆయన కలసి పార్టీని పటిష్టం చేస్తున్నారు. చివరికి ఆయనకు షాక్ తప్పదని భావిస్తున్నారు.