రైల్వేకోడూరు జనసేన టికెట్‌ను అరవ శ్రీధర్ దక్కించుకున్నారు. ఇటీవల జనసేన అధ్య క్షులు పవన్‌కల్యాణ్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైల్వేకోడూరుకు యన మల భాస్కర్‌రావు పేరును ప్రకటించారు. అప్పట్లో ఎవరికీ తెలియని వ్యక్తికి టికెట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనసేనలో అంతర్మధనం నెలకొంది.
యనమల భాస్కర్ రావును వ్యతిరేకించిన టీడీపీ
ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో మరింత లోతుగా అధ్యయనం చేశారు. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఓబులవారిపల్లె మండ లంలోని ముక్కావారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ టికెట్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం దక్కడం చర్చనీయాంశంగా మారింది. జనసేన రైల్వేకోడూరు అభ్యర్థిత్వం మార్పుపై సీరియస్‌గా దృష్టి సారించింది. టిడిపి అభ్యర్థికి ఆర్థిక, అంగ, అనుచర బలం కలిగిన ముక్కావారిపల్లికి చెందిన టిడిపి రైల్వేకోడూరు ఇన్‌ఛార్జి ముక్కా రూపా నందరెడ్డి పావులు కదిపినట్లు తెలుస్తోంది.
టీడీపీ ఇంచార్జ్ స్వగ్రామం సర్పంచ్ శ్రీధర్
వైసిపి తరుపున ఐదవ విడత ఎన్నికల బరిలో నిలిచిన కొరముట్ల శ్రీనివాసులుకు ధీటైన అభ్యర్థిగా కూటమి తరుపున స్థానికుడు, అందరికీ పరిచయం కలిగిన అభ్యర్థి అరవ శ్రీధర్‌ను నిలబెట్టడంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న సమయంలో రైల్వే కోడూరు నియోజక వర్గ జనసేన, తెలుగుదేశం కలసి అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు స్థానం జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేసినట్లు జనసేన ప్రకటించింది. అరవ శ్రీధర్ మూడు రోజుల కిందటే జనసేన పార్టీలో చేరారు. రైల్వే కోడూరు నియోజక వర్గం ముక్కావారిపల్లె గ్రామ స్పంచ్‌గా ఉన్నారు. ఆయన టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానందరెడ్డి స్వగ్రామానికి చెందిన వారు. ఆయన సిఫారసుతోనే టిక్కెట్ దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అవనిగడ్డకు టీడీపీ ననేత పేరు ఖ
ఉదయమే అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. అవనిగడ్డ నుంచి ఆయనే బలమైన అభ్యర్థిగా నిర్ణయించి పేరును ఖరారు చేశారు. మండలి బుద్దప్రసాద్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు పలుమార్లు ఆయన ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు ఉన్న నేత కావడంతో పవన్ కల్యాణ్ ఆయన వైపే మొగ్గు చూపారు. జనసేన పార్టీ టిక్కెట్ ఆశించిన బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ వంటి వాళ్లు నిరాశకు గురయ్యారు.