దేశ ప్రజలకు రాముడి ఆశీస్సులు – ఇంటింటికి అయోధ్య తలంబ్రాలు

అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీరాముడి తలంబ్రాలను పంపిణీ చేయాలని బీజేపీ-సంఘ్‌పరివార్‌ నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో తలంబ్రాల బస్తాలను పంపిచారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగగానే.. ఇక్కడ అదే సమయంలో ఇంటింటికీ శ్రీరాముడి తలంబ్రాలను పంపిణీ చేయనున్నారు.

దేశవ్యాప్త పండుగలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం

జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్త పండుగలా నిర్వహించాలనుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలు, హిందూత్వ సంస్థల ప్రాంగణాల్లో లైవ్‌ కవరేజీ ద్వారా భక్తులకు వినిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ అయోధ్యకు రాలేరు కాబట్టి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఆయా ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా పండుగ

ఇదే తరహాలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవం తర్వాత అయోధ్యకు తీసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి ప్రజలు అయోధ్య వెళ్లాలని అనుకుంటున్నప్పప్పటికీ కేవలం పది పదిహేనువేల మంది అతిథులకు మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీవీఐపీలు సైతం రావొద్దని అయోధ్య ట్రస్టు పేర్కొన్నది. రామ్‌ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ముందు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

దేశ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీజేపీ

బీజేపీ ఒకప్పుడు తాము ఇచ్చిన మాటను ఈ విధంగా నిలబెట్టుకున్నామని చాటుతోంది. అయోధ్యలో రామలయం నిర్మిస్తామని బీజేపీ ప్రజలకు ఎప్పుడో హామీ ఇచ్చింది. దాన్ని నిజం చేస్తోంది. ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జన్‌ఉత్సవ్‌లు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఈ ప్రాంతంపై దీర్ఘకాలికంగా సాగిన వివాదాన్ని పరిష్కరించి, అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తోంది.