రత్నాలు పొదిగిన తిలకం, బంగారు విల్లు, బాణం – అయోధ్య రాముడి ఆభరణాలన్నీ ప్రత్యేకమే!

జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించిన కోట్లాది భక్తులకు ఆ తర్వాత రోజు నుంచి రామయ్యను నేరుగా దర్శించుకునే అవకాశం లభించింది. అయితే బాలరామునికి అలంకరించిన దివ్య ఆభరణాలు, వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయోధ్య రాముడు ధరించిన ఆభరణాలకి ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.

కిరీటం
బాల రాముడికి పెట్టిన కిరీటం సుమారు 1.7 కిలోల బరువు ఉంటుంది. ఇందులో 22 క్యారెట్ల బంగారంతో రూపొందించారు. ఇందులో 75 క్యారెట్ల డైమండ్లు, 135 క్యారెట్ల జాంబియన్ ఎమరాల్డ్, 262 క్యారెట్ల రూబీలుతో దీన్ని తయారు చేశారు. ఐదున్నర సంవత్సరాల బాలుడికి సరిపోయే విధంగా దీన్ని రూపొందించారు. ఈ కిరీటం మధ్యలో సూర్య భగవానుడి చిహ్నం ఉంటుంది. ఉత్తర భారతదేశ సంప్రదాయంలో బంగారంతో దీన్ని తయారు చేశారు.

కుందల్
కిరీటానికి సరిపోలే విధంగా ఊ కుందల్ తయారు చేశారు. నెమలి ఆకారంలో ఉంటాయి. వీటిని కూడా బాగారం, వజ్రాలు, రూబీస్, ఎమరాల్డ్ తో అలంకరించారు.

కంఠాభరణం
బాల రాముడికి పెట్టిన కంఠాభరణం మొత్తం రాళ్ళతో పొదిగింది. దీని మధ్య భాగంలో కూడా సూర్య దేవుని బొమ్మ ఉంటుంది. ఇందులో ఎమరాల్డ్ తీగలు ఉంచారు. బంగారంతో దీన్ని తయారు చేశారు. అందులో వజ్రాలు, ఎమరాల్డ్ అమర్చారు.

కౌస్తభా మణి
బాల రాముడి గుండెల మీ ఈ మణి ఉండే విధంగా చేశారు. ఇందులో మొత్తం రూబీలు, వజ్రాలతో తయారు చేశారు.

పాదిక
గొంతు కింద భాగంలో ఈ నెక్లెస్ పెట్టారు. వజ్రాలు, ఎమరాల్డ్, ముత్యాలు పొదిగిన హారాన్ని నాభి వద్ధ అలంకరించారు. ఐదు తీగల వజ్రం పెట్టారు. దీనికి ఒక పెద్ద పెండెంట్ జత చేశారు.

విజయమాల
ఇది మూడోది, అతి పెద్ద నెక్లెస్. బంగారం, రూబీలతో దీన్ని రూపొందించారు. విజయానికి చిహ్నంగా దీన్ని ధరింపజేశారు. వైష్ణవ ట్రెడిషన్ లో దీన్ని తప్పకుండా ధరిస్తారు. ఇందులో సుదర్శన చక్రం, తామర పువ్వు, శంఖం, మంగళ కలశం ఉంటుంది. దేవతలకి ఇష్టమైన పువ్వులు కమలం, చంపా, పారిజాతం, తులసి, కుండ గుర్తులు కూడా దీని మీద ఉన్నాయి.

కంచి
రత్నాలతో తయారు చేసిన ఈ కంచి లేదా కర్దాని మణికట్టుకి వేశారు. బంగారంతో దీని తయారు చేశారు. ఇందులోనూ వజ్రాలు, ముత్యాలు, ఎమరాల్డ్ పొదిగి ఉన్నాయి. స్వచ్చత భావాన్ని స్పురించేలా ఇందులో ఐదు చిన్న గంటలు కూడా అమర్చారు. ముత్యాలు, రూబీలు, ఎమరాల్డ్ తీగలు ఈ గంటల నుంచి వేలాడుతూ కనిపిస్తాయి.

భుజ బంద్
ఇవి రెండు చేతులకి వేశారు. బంగారం, విలువైన రత్నాలతో వీటిని రూపొందించారు.

కంగన
రాళ్ళతో చేసిన ఈ ఆభరణాలు రెండు చేతులకి వేశారు.

ముద్రిక
బంగారం, రత్నాలు, ముత్యాలతో తయారు చేసిన ఉంగరాలు పెట్టారు.

నుదుటి తిలకం
వజ్రాలు, రూబీస్ తో రూపొందించి తిలకం బాల రాముడి నుదిటిన మెరుస్తోంది

బంగారు బాణం
ఎడమ చేతిలో బంగారంతో తయారు చేసిన విల్లు, కుడి చేతిలో బాణం ఏర్పాటు చేశారు.

కాళ్ళ దగ్గర బంగారంతో తయారు చేసిన కమల పూల దండ వేశారు. వీటితో పాటు బాల రాముడి ఆడుకునేందుకు వీలుగా ఏనుగు, గుర్రం, ఒంటె, బొమ్మ బండి పెట్టారు. బంగారంతో చేసిన గొడుగు ఏర్పాటు చేశారు. బాల రాముడు ధరించి వస్త్రం కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. పసుపు ధోతి, ఎరుపు రంగు పతాక అంగవస్త్రాలు స్వచ్చమైన బంగారు జారీ దారాలతో అలంకరించారు. వాటి మీద విష్ణువు చిహ్నాలైన శంఖం, పద్మం, సుదర్శన చక్రం, నెమలి ఉన్నాయి. ఈ వస్త్రాలని అయోధ్య ధామ్ లో పని చేసిన ఢిల్లీ టెక్స్ టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి రూపొందించారు.