కాంగ్రెస్ హయాంలో పద్మా అవార్డులు అంటే.. రాజకీయంగా లాబీయింగ్ చేసుకున్న వారికే వస్తాయి. కానీ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది కేంద్రం. ఇప్పుడు అవార్డులు ఆయా రంగాల్లో అసమాన ప్రతిభ చూపిన వారికే దక్కుతున్నాయి. దానికి సాక్ష్యం ఈ ఏడాది అవార్డులు పొందిన వారే.
ప్రచారం లభించని రంగాల్లో నిపుణులకు పురస్కారాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎనిమది మందికి పద్మ అవార్డులు వచ్చారు. రెండు పద్మ విభూషణ్ పురస్కారాలు ఇచ్చారు. వీరంతా తమ తమ రంగాల్లో అద్భుతమైన పని తీరుతో ఎదగి వచ్చిన వారే. నిజానికి చాలా మంది గొప్ప ప్రతిభ ఉన్న వారు అయినప్పటికీ.. వారికి తగినంత గుర్తింపు రాలేదు. దానికి కారణం ఆయా రంగాలకు మీడియాతో పాటు ఇతర చోట్ల పెద్దగా ప్రచారం లిభించకపోవడమే. అయినప్పటికీ వారిని గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలతో సన్మానించింది.
తెలుగువారికి అత్యున్నత పురస్కారాలు
వెంకయ్యనాయుడుతో పాటు చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించారు. ఇది రెండో దేశ అత్యున్నత గౌరవం. ఈ రెండింటికి వారు అర్హులే. రాజకీయ రంగంలో వెంకయ్యనాయుడు సాధించింది అనన్య సామాన్యం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆయన రాజకీయ జీవితం కొనాసగించారు. చివరికి వరకూ ఆయనది ఒకటే మాట. ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయడం.. బయటకు పోవడం రావడం అనేది లేదు. ఉపరాష్ట్రపతిగా చేసి రిటైరైన ఆయన… ఇప్పుడు విద్యాసంస్థల్లో తన అనుభవాలను ప్రసంగాల రూపంలో వివరిస్తూ.. యువతను కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. ఇక చిరంజీవి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన స్వయంకృషే ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టింది. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన నటుడిగా చిరంజీవికి గుర్తింపు ఉంది. ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వడం అంటే.. ఆయన ప్రతిభను పూర్తిగా గుర్తించడమే.
రాజకీయాలకు అతీతమైన పురస్కారాల వల్ల మరింత గౌరవం
గతంలో రాజకీయ సిఫారసుల వల్లే ఎక్కువగా పద్మ అవార్డులు ప్రకటించేవారు. అయితే కొంత కాలంగా కొన్ని రాజకీయ సిఫార్సుల వల్ల ఇస్తున్నప్పటికీ.. ఎక్కువగా గుర్తింపు పొందని కళాకారులకే వెదికి మరీ ఇస్తున్నారు. దీని వల్ల పద్మ అవార్డులపై మరింత ఆసక్తి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు నోచుకోని కళాకారులకు కేంద్ర పద్మ అవార్డులు అనందం కలిగిస్తున్నాయి.