ఆటో జానీ కాస్తా ట్యాక్సీ డ్రైవర్ అయ్యాడే

వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ మీదున్న మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు భోళా శంకర్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలో స్టిల్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో ట్యాక్సీపై కూర్చున్న మెగాస్టార్ టీ తాగుతూ ఫోజులిచ్చారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగేతే ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇంకా అంబాసిడర్ కారే వాడుతున్న మెగాస్టార్
భోళా శంకర్ స్టిల్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. మెగాస్టార్ కూడా వింటేజ్ లుక్ లో సూపర్బ్ గా ఉన్నారు. ఎప్పుడే 25 ఏళ్ల క్రితం వచ్చిన రౌడీ అల్లుడు సినిమాలో ఆటో జానీలో కన్పిస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడే అసలు డౌట్ కూడా మొదలైంది. రౌడీ అల్లుడు సినిమాలో మెగాస్టార్ కేరక్టర్ పేరు ఆటో జానీ. ఇదే టైటిల్ తో మెగాస్టార్ తో సినిమా తీసేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొన్నాళ్లు బాగా ట్రై చేశారు. కానీ కథ వర్కవుట్ కాకపోవడంతో.. సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. మెహర్ రమేశ్ పూరీ జగన్నాథ్ శిష్యుడే. దీంతో ఆటో జానీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సినిమా తీస్తున్నాడని అనుకుంటున్నారు. అయితే మరీ ఆటో జానీ అని యాజ్ ఇట్ ఈజ్ గా పెడితే బాగోదని ఆటో ప్లేస్ లో ట్యాక్సీ తెచ్చినట్లున్నారు. అన్నింటికి మించి ఓలా, ఉబర్ లాంటివి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ యెల్లో కలర్ ట్యాక్సీలు, అంబాసిడర్లు కార్లు ఎక్కడ ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు.
అందరి కళ్లు మెహర్ రమేశ్ పైనే
వాల్తేరు వీరయ్య హిట్ తో బౌన్స్ బ్యాక్ అయిన చిరు… ఇప్పుడు భోళా శంకర్ తో హిట్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ బయటకు రాకుండా టీమ్ బాగానే కష్టపడుతుంది. అంతా బాగానే ఉంది సినిమా డైరెక్టర్ దగ్గర అభిమానులు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేశ్ సినిమా చేసే పదేళ్లు దాటింది. అంతకుముందు ఏవైనా హిట్స్ ఉన్నాయా అంటే డిజాస్టర్లే. అలాంటి మెహర్ మెగాస్టార్ ని ఎలా ప్రజెంట్ చేస్తాడా అని అందరూ భయపడుతున్నారు. మరి మెగాస్టార్ ని మెహర్ ఎలా ప్రజెంట్ చేశాడు అనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చేవరకు ఆగాల్సిందే మరి.