ఎక్కడైనా హీరో ఎంట్రీ ఇచ్చే వరకే హడావుడి. ఆ తర్వాత సీన్ అంతా మారిపోతుంది. అదే సూపర్ హీరో అయితే చెప్పాల్సిన పని లేదు. భారత రాజకీయాల్లో అలాంటి సూపర్ హీరో నరేంద్రమోదీ అని మరోసారి నిరూపితమవుతోంది. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా మళ్లీ ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టాల్ని.. మహాత్మా గాంధీకి సంబంధం లేదని గాంధీ వారసులకు దేశాన్ని అప్పగించాలని కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇందు కోసం పట్నాలో సమావేశమై.. ఇక తేల్చేస్తాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు వారి రెండో సమావేశం జరుగుతుందో లేదో తెలియనంతగా రాజకీయాలు మారిపోయాయి. అంతేనా.. విపక్షాల కన్నా బలమైన కూటమి తమకు ఉందని బీజేపీ అగ్రనేతలు నిరూపిస్తున్నారు.
18వ తేదీన ఎన్డీఏ పక్షాల భేటీ
పద్దెనిమిదో తేదీన ఎన్డీఏ పక్షాల సమావేశం జరగబోతోంది. ఇందుకు మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. వివిధ రాజకీయ కారణాలతో ఎన్డీఏకు దూరం అయిన పార్టీలు కూడా సమావేశానికి రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయని ఈ సమావేశం సాక్ష్యంంగా ఉంటుంది. ఇప్పటి వరకూ అధికారికంగా ఎన్డీఏలో కూటమిలో ఉన్న పార్టీలే కాదు.. ఎవరూ ఊహించని గత కూటమి పార్టీలుకూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయి.
ఎన్డీఏలోకి షాకిచ్చేలా పాత స్నేహితుల రాక… నితీషేనా.?
పద్దెనిమిదో తేదీన జరగనున్న ఎన్డీఏ భేటీలో రాజకీయ వ్యూహకర్తలు కూడా ఊహించని విధంగా గతంలో ఎన్డీఏలో ఉండి విడిపోయిన వారు వస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వారెవరో ఎవరూ ఊహించలేరని అంటున్నారు . ఎన్డీఏలోకి వస్తారని ప్రచారంలోకి రాని నేతలు వస్తారని అంటున్నారు. శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏలోకి రావడం ఖాయమయిది. మరి షాకిచ్చే పార్టీ ఏదంటే.. నితీష్ కుమార్ అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం విపక్షాల కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన వస్తే విపక్ష కూటమి కొలాప్సే. ఇదే అసలైన ఆ షాక్ అనుకుంటున్నారు.
మోదీ, షా దృష్టి పెట్టనంత వరకే !
మోదీ , షాలు అధికారిక బాధ్యతల్లో బిజీగా ఉంటారు. రాజకీయాలపై వారు దృష్టి పెట్టి సీరియస్ గా తీసుకుంటే సీన్ మారిపోతుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని అంటున్నారు. పద్దెనిమిదో తేదీకి ఇంకా పది రోజుల వరకూ సమయం ఉంది. ఈ లోపు ఎన్డీఏలో ఎన్ని కొత్త పార్టీలు చేరుతాయన్నది ఎవరూ ఊహించని పరిణామంగా ఉంది. జాతీయ మీడియా … ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల్లో కొన్ని వచ్చి చేరుతాయని అంచనా వేస్తున్నారు.