ప్రశాంత్ కిషోర్ దేశంలో రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేస్తే .. ఆయనను బీజేపీ అధికార ప్రతినిధిగా ఎద్దేవా చేశారు కొంత మంది. బెంగాల్ లో పరిస్థితిని చెబితే ఆయనతే సర్వీస్ చేయించుకుని మూడో సారి గెలిచిన మమతా బెనర్జీ కూడా ఆయన డబ్బు మనిషి అన్నారు. ఏపీలో జగన్మోహన రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నారని ఆయన చెబితే.. జగన్ సహా అందరూ ఎగతాళి చేశారు. కానీ ఎగ్టిట్ పోల్స్ చూసిన తరవాత వారికి నోట మాట రావడం లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం వారందర్నీ టీజ్ చేస్తున్నారు.
ప్రజాభిప్రాయాన్ని పక్కాగా పట్టేస్తున్న ప్రశాంత్ కిషోర్
ఐ ప్యాక్ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ .. దేశంలో రాజకీయ వ్యూహచతురుడిగా పేరు పొందారు. బెంగాల్, తమిళనాడు తర్వాత ఆయన స్ట్రాటజిస్టుగా పని చేయడం మానేశారు. గెలిచే పార్టీకే పని చేస్తారని ఆయనపై విమర్శలు ఉన్నా… ఈ విషయంలో ఆయన అంచనాలు కరెక్టే కదా అని అనుకోవాలి. గెలిచే పార్టీని క్లైయింట్ చేసుకోవడం ఆయన గొప్పతనం అనుకోవచ్చు. ఆయన సేవలు తీసుకున్న వారు కూడా … గ్రౌండ్ రియాల్టీని చెబితే ఆయనపైనే నిందలేశారు.
బీజేపీపై వ్యతిరేకత లేదని ముందే చెప్పిన ప్రశాంత్ కిషోర్
దేశంలో బీజేపీపై వ్యతిరేకత లేదని గతంలో వచ్చినన్ని లేదా.. అంత కంటే ఎక్కువే వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెబుతూ వస్తున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ అవే చెప్పాయి. బెంగాల్లో తృణమూల్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు.. ఏపీలో జగన్ భారీ స్థాయిలో ఓడిపోతారని తేల్చారు. ఎగ్డిట్ పోల్స్ లో అదే వచ్చింది. ఎగ్జాట్ పోల్స్ లోనూ ఇవే ఫలితాలు వస్తే పీకే ఇమేజ్ మరింతగా పెరుగుతుంది.
దక్షిణాదిన కూడా సరిగ్గా అంచనా వేసిన పీకే
దక్షిణాదిన ఈ సారి మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంతో బీజేపీ ఏపీలో కూటమి కట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షా ఈ సారి దక్షిణాదిలో అత్యధిక సీట్లు సాధిస్తామని చెబుతూ వచ్చారు. పీకే కూడా అదే నిజమన్నారు.