ల్యాప్ టాప్ ఒళ్లో పెట్టుకుని వర్క్ చేస్తున్నారా!

ఇప్పుడంతా ల్యాప్ టాప్ ట్రెండ్. ఎక్కడి నుంచైనా వర్క్ కంప్లీట్ చేయాలంటే వెంట ల్యాప్ టాప్ ఉండాల్సిందే. ఎక్కడుంటే అక్కడే కూర్చుని ఒడిలో ల్యాప్ టాప్ పెట్టుకుని చకచకా వర్క్ చేసేస్తున్నారు. ల్యాప్ టాప్ ఒళ్లో పెట్టుకుని పనిచేయడం సౌకర్యవంతంగా ఉంటుంది కానీ ఇది ఎంత ప్రమాదమో తెలుసా అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

సంతానోత్పత్పిపై ప్రభావం
ల్యాప్ టాప్ ‍ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వల్ల …ల్యాప్‌టాప్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలున్నాయి. అత్యవస పరిస్థితుల్లో ఓ పావుగంట,అరగంట వరకూ పర్వాలేదు కానీ గంటలతరబడి ఇలాగే ఉంచితే సంతాన లేమి సమస్యకు కారణమవుతుంది.

మెడ, వెన్ను నొప్పి
ల్యాప్ టాప్ డెస్క్ పై పెట్టుకుని వర్క్ చేస్తే …స్ట్రైయిట్ గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒళ్లో పెట్టుకోవడం వల్ల మెడ, వెన్ను వంచాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రస్తుతానికి ఏం తేడా తెలియకపోయినా దీర్ఘకాలిక సమస్యలు మొదలవుతాయి.

చర్మ సమస్యలు
గంటల తరబడి ఒళ్లో ల్యాప్ టాప్ పెట్టుకోవడం వల్ల చర్మం ఎర్రగా మారే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు దురద, మంట సమస్య ఉంటుంది. దీర్ఘకాలంగా ఇలాగే ఉంటే సమస్య పెరుగుతుంది.

కంటి సమస్యలు
కొందరైతే మంచపై పడుకుని కూడా ఒళ్లో ల్యాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేస్తుంటారు. అలా చేస్తే కళ్లపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు ల్యాప్ టాప్ ని అలా ఉంచితే సరైన నిద్ర పట్టదు. కళ్లకు సరైన దూరంలో ఉంచి ల్యాప్ టాప్ వాడాలి. లేదంటే బ్లూ లైట్ రిఫ్లెక్ట్ చేసే కళ్లద్దాలు వాడటం కాస్త మేలు.

ప్రెగ్నెన్సీ
రేడియేషన్ ప్రభావం మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద అంతగా ప్రభావం చూపదు. కానీ గర్బంతో ఉన్నవాళ్లు ల్యాప్ లాప్ తొడమీద పెట్టుకుని పనిచేయడం ప్రమాదం. వేడి వల్ల పుట్టబోయే బిడ్డమీద ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.