స్వీట్స్ అంచే ఇష్టంలేనివారి సంఖ్య చాలా తక్కువే. కొంతమంది అయితే ఏమీ ఊసుపోకుంటే పంచదార అయినా తినేస్తారు. అయితే ఈ స్వీట్ మోతాదుపై శ్రద్ధ తీసుకోకుంటే చాలా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే మాత్రం మీరు స్వీట్స్ ఎక్కువగా తింటున్నట్టే…
మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
అప్పుడే స్వీట్ తిన్నా కానీ మళ్లీ ఇంకోటి తింటే బావుండును అనిపిస్తుంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. అలాగే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో ఎక్కువగా ఉండే ఇన్సులిన్ ధమనుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది.
ధమనుల గోడలు ఎర్రబడి గట్టిగా తయారవుతాయి. దీంతో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
ఏజ్ ఎక్కువగా కనిపించడం
కొందరు వయసు కన్నా పెద్దవారిలా కనిపిస్తారు. స్వీట్స్ ఎక్కువ తినేవారిలో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. పంచదారతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా దరి చేరుతాయి. స్వీట్స్ ఎక్కువ తింటే మెదడులో డోపమైన్ అనే హ్యపీ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇతర ఆహారాలను తీసుకున్నప్పుడు ఈ హార్మోన్ విడుదల తక్కువగా ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే…ఆనందంగా ఉండాలంటే స్వీట్ తినాలి అన్నట్టు మారిపోతారు..
తెలియని ఆతృత-భయం
కొందరు చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ఆందోళన చెందుతారు. అవసరం లేనిదగ్గర ఆతృత ప్రదర్శిస్తారు. లేనిపోని భయాలు పెట్టుకుంటారు. ఈ లక్షణాలు కూడా ఎక్కువగా పంచదారతో తయారు చేసిన స్వీట్స్ తినడం వల్లే అంటారు ఆరోగ్య నిపుణులు.
పంచదార వినియోగం వల్ల స్ధూలకాయం, డయాబెటిస్ తోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని ప్రభావం కాలేయంపై తీవ్రంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ల స్ధాయి పెరిగి జీవక్రియలు దెబ్బతింటాయి. అందుకే పంచదార వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిది..
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.