పాడవకుండా ఉండాలని అన్నీ ఫ్రిజ్ లో కుక్కేస్తున్నారా..ఆగండి..ఇవి పెట్టకూడదు!

కూరగాయలు, పండ్లు, ఆహారపదార్థాలు, వండిన వంటలు అన్నిటినీ ఫ్రిజ్ లో పెట్టేయడం చాలామందికి అలవాటు. అవెక్కడ పాడైపోతాయో అని అలా చేస్తుంటారు కానీ కొన్నింటింని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. అవేంటో చూద్దాం..

  • మామిడి పండ్లు బోలెడు డబ్బులు పెట్టి కొనితీసుకొచ్చాం కదా బయట ఉంటే పాడైపోతాయని అలా ఫ్రిజ్ లో పెట్టేస్తారు. కానీ అస్సలు చేయకూడని పని ఇది. ఒకవేళ మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టాలని అనుకుంటే ముందుగా వాటిని కాసేపు నీళల్లో నానబెట్టి కడిగి అవి ఆరిన తర్వాత కట్ చేసి మూతపెట్టి అప్పుడు పెట్టొచ్చు
  • చల్లటి పుచ్చకాయ తినడం అంటే చాలామందికి ఇష్టం. ఇందుకోసం కట్‌ చేసిన ముక్కలను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేస్తే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. తియ్యగా ఉండాల్సిన వాటర్‌ మిలాన్‌ కాస్త చప్పగా మారిపోతుంది.అందుకే కట్ చేసి పెట్టొద్దు
  • టమాటాలను కూడా ఫ్రిజ్‌లో పెడితే వాటి మీద ఉండే ప‌లుచ‌టి పొర ముడ‌త‌లు ప‌డిపోయి.. అందులోని విట‌మిన్ సి త‌గ్గిపోతుంది. అలాగే ట‌మాటాల రుచి కూడా పోతుంది. అందుకే ట‌మాటాల‌ను గాలి త‌గిలే ప్రదేశంలోనే ఉంచాలి.
  • ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వాటిపై తొక్కలోని తేమ ఆవిరై గట్టిపడుతుంది. దీనివల్ల ముక్కలు తరగడం కష్టమవుతుంది. అలాగే లోపలి పిండి పదార్థం కూడా తేమను పూర్తిగా కోల్పోతుంది.
  • దోస‌కాయ‌ల‌ను క‌ట్ చేశాక ఫ్రిజ్‌లో పెట్టడం వ‌ల్ల అందులోని పోష‌కాలు త‌గ్గిపోతాయి. కాబ‌ట్టి ఫ్రిజ్‌లో పెట్టిన దోస‌కాయ ముక్కలను తిన‌డానికి బ‌దులు.. కంటిపై రుద్దుకునేందుకు మాత్రమే వాడండి
  • మున‌క్కాయ‌ల‌ను ఫ్రిజ్‌లో ఉంచ‌డం వ‌ల్ల కర్రల్లా త‌యార‌వుతాయి. కాబ‌ట్టి వీటిని గ‌ది ఉష్ణోగ్రత వ‌ద్ద నిల్వ చేయ‌డ‌మే ఉత్తమం.
  • పుదీనా ఆకులను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల నల్లగా మారిపోతాయి. అలాంటి ఆకులను వంటల్లో ఉపయోగిస్తే ఆహారం విషతుల్యంగా మారుతుంది.
  • బ్రెడ్ పాడైపోతుందని ఫ్రిజ్ లో పెడుతుంటారు. బయట ఉంటే పాడవుతుందని అలా చేస్తారు కానీ ఫ్రిజ్ లో పెడితే గట్టిగా అవడంతో పాటూ బూజు కూడా వస్తుంది, టేస్ట్ మారిపోతుంది
  • తేనెను , నూనెలను ఫ్రిజ్ లో పెట్టడం సరికాదు పెడితే తొందరగా చిక్కబడి గట్టిగా తయారవుతుంది. వాడుకోవడానికి అనువుగా ఉండదు.
  • కాఫీ పౌడ‌ర్‌ను కూడా ఫ్రిజ్‌లో పెడితే రుచి పోతుంది

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం