ఆలయానికి వెళ్లడం అంటే ఇలా వెళ్లి అలా దర్శించుకుని ప్రసాదం తినేసి రావడం కాదు. ఓ పద్ధతి ఉంటుంది. పాటించాల్సిన కొన్ని నియమాలుంటాయి. దైవభక్తి లేనివారి సంగతి సరేకానీ భక్తితో ఆలయంలోకి అడుగుపెట్టేవారు మాత్రం తప్పనిసరిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గుడికి వెళ్లడం అంటే స్వామిదర్శం కోసంమాత్రమే కాదు..దీనివెనుక శాస్త్రీయ ప్రయోజనాలుకూడా ఉన్నాయి.
సాధారణంగా భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించారు. అందుకే అలాంటి ఆలయాల్లో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంత పవిత్రమైన ప్రదేశానికి వెళ్లినప్పుడు కొన్ని నియమాలు పాటించడం తప్పనసరి
- ఆలయంలోకి అడుగుపెట్టగానే చాలామంది ప్రదిక్షిణలు చేస్తారు.ఏదో పని ఉన్నట్టు గబగబా కాకుండా నిదానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి.
- ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజ స్ధంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు
- యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకుని, చెవికి తగిలించుకుని, అపసవ్యంగా వేసుకుని ఆలయంలోకి ప్రవేశించకూడదు
- మనసునిండా ఆలోచనలతో దేవుడిని దర్శించుకోరాదు. స్వామివారి సన్నిధిలో అబద్ధాలు అస్సలు చెప్పకూడదు
- దేవాలయంలో దేవుడికి వెనుక తిరిగి కూర్చోరాదు
- శివాలయంలో లింగం, నందికి మధ్యలో నడవకూడదు
- కొందరికి భక్తి ఎక్కువై దేవుడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు..ఏడుస్తూ దేవుడిని స్తుతిస్తుంటారు. అయితే ఆలయంలో కన్నీళ్లు పెట్టుకోరాదు, ఏడుస్తూ దేవుడిని వేడుకోకూడదు
- గంజి పెట్టిన వస్త్రాలు వేసుకుని దేవుడిని దర్శించుకోకూడదు, ఖాళీ చేతులో గుడిలోకి వెళ్లకూడదు
- దేవాలంలో స్వార్ధంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండకూడదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి
- సంప్రదాయ విరుద్ధమైన దుస్తులతో ఆలయంలోకి ప్రవేశించకూడదు
- ఆలయంలో అడుగుపెట్టేవారి నుదుటిన కుంకుమ బొట్టు ఉండాలి
- ముఖ్యంగా ఈ మధ్య మహిళలకు జుట్టు విరబోసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది..ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు విరబోసుకుని దేవాలయాలు దర్శించ కూడదు
- మాసిన, చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు
- గుడిలో మొదట ధ్వజ స్థంబం శిఖరం దర్శించి మూడు ప్రదక్షిణలు చేయాలి, గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలి పీఠాలను తాకకూడదు.
- గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు
- ఇంటి నుంచి తీసుకువెళ్ళి నివేదించిన ప్రసాదం భక్తులకు పంచేయాలి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.