వంటింట్లోకి కొత్త కొత్త గ్యాడ్జెట్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో వంటచేసే పద్ధతే మారిపోయింది. అప్పట్లో గంటలతరబడి సమయం పట్టేది కానీ ఇప్పుడు ఏం కావాలన్నీ చిటికెలో తయారైపోతోంది. అందుకు కారణం అందుబాటులో ఉన్న పరికరాలే. వాటిలో ఒకటి ప్రెషర్ కుక్కర్ . అన్నం, పప్పు, కూర ఏదైనా కానీ దీనిని ఉపయోగించి సులభంగా పూర్తిచేసేయవచ్చు. అస్సలు టైమ్ వేస్ట్ కాకుండా స్టౌ దగ్గర నిల్చోకుండా పనైపోతుంది. చక్కగా ఉడుకుతాయి కూడా. అయితే దీనివల్ల వంట రుచి పోవడమే కాదు ఆరోగ్య సమస్యలు కూడా తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అన్నం
అన్నాన్ని చాలామంది ప్రెషర్ కుక్కర్‌లో వండుతుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. బియ్యంలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండినప్పుడు ఈ స్టార్చ్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. దానివల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండకపోవడమే మంచిదంటున్నారు.
బంగాళదుంపలు
తొందరగా ఉడుకుతాయని చాలామంది బంగాళదుంపలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తారు. అయితే బియ్యంలో ఉన్నట్టుగానే బంగాళదుంపల్లో కూడా స్టార్చ్ మోతాదు అధికంగా ఉంటుంది. కాబట్టి, వీటిని కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
పాస్తా
చాలామంది పాస్తాను లొట్టలేసుకుని తింటుంటారు. అయితే దీనిని కొంతమంది ప్యాన్‌పై చేస్తే మరికొంతమంది మాత్రం ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగిస్తుంటారు. బియ్యం, బంగాళదుంపల్లో ఉన్నట్టుగానే పాస్తాలో కూడా స్టార్చ్ అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి, దీనిని కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. దీనికి బదులుగా ప్యాన్‌పై వండుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
పాలు
పాలు కొద్దిగా వేడిచేస్తే పొంగిపోతాయి. అందుకే ఎలాంటి ప్రెషర్ కుక్కర్‌లోనూ పాలను అస్సలు పెట్టొద్దు
గుడ్లు
చాలా మంది గుడ్లను ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెడతారు. కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల.. గుడ్లు లోపల పగలవచ్చు. ప్రెషర్ కుక్కర్లు కూడా పేలే ప్రమాదం ఉంది.
కూరగాయలు
కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కూరగాయలు వండకూడదని కాదు కానీ అందులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు తగ్గిపోతాయి. తాజా కూరగాయల రుచి కూడా మారుతుంది.
అంటే పిండి పదార్థం అధికంగా ఉన్న పదార్థాలను మాత్రమే ప్రెషర్ కుక్కర్లో వండకూడదు. అవి విషపూరితంగా మారుతాయి. దీనివల్ల ఆహారంలోని లెక్టిన్ రసాయనం స్థాయి తగ్గుతుంది. లెక్టిన్ అనేది హానికరమైన రసాయనం. ఇది ఆహారంలోని ఖనిజాలను గ్రహించి, పోషక విలువలను తగ్గిస్తుంది.కానీ మిగతా ఆహారపదార్థాలను కుక్కర్లో వండుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం