జుట్టుకి హెన్నా పెట్టేవారు ఈ జాగ్ర్తతలు తీసుకుంటున్నారా!

జుట్టు చిట్లిపోకుండా, ఊడిపోకుండా ఉండేందుకు హెల్తీగా పెరిగేందుకు తరచూ హెన్నా పెట్టుకుంటారు. హెన్నా అప్లై చేయడం మంచిదే కానీ మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో ఓసారి చూసుకోండి…

ఈ రోజుల్లో, జుట్టును నల్లగా మార్చేందుకు మార్కెట్‌లో ఎన్నో రంగులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా తక్షణం కావాల్సిన రంగులు జుట్టుకి వేసేసుకుంటున్నారు. అయితే హెల్తీ హెయిర్ గ్రోత్ కోసం ఇప్పటికీ హెన్నా అప్లై చేసేవారి సంఖ్య ఎక్కువే. కొందరు పార్లర్ కి వెళ్లి హెన్నా పెట్టించేసుకుంటారు మరికొందరు ఇంట్లోనే హెన్నా ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకుంటారు. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు..

చర్మ సమస్యలు వస్తున్నాయా!
హెన్నాను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇది జుట్టు రాలడం, అలెర్జీలు సంభవించే చర్మ ప్రతిచర్యలకు కూడా కారణమవుతుంది. అందుకే హెన్నాని అప్లై చేసినప్పుడు స్కిన్ కి సంబంధించి ఏవైనా మార్పులొస్తున్నాయా అన్నది గమనించాలి.

పొడి జుట్టు మీద వద్దు
జుట్టు పొడిగా ఉంటే హెన్నా బాగా పడుతుంది అనుకుంటారు కానీ జుట్టు మరీ డ్రైగా ఉన్నప్పుడు హెన్నా పెడితే మరింత డ్రై అయిపోతుంది. అంటే జుట్టులో జీవం పోతుంది. రంగు కూడా బాగా కనిపించదు. అందుకే ముందుగా హెయిర్ కండీషనర్‌ని వినియోగించి అప్పుడు హెన్నా అప్లై చేస్తే దీనివల్ల జుట్టు పొడిబారదు.

రకరకాలు మిక్స్ చేయొద్దు
రకరకాల ప్యాక్ లు మిక్స్ చేయడం సరికాదు..ఏదో ఒక బ్రాండ్ హెన్నా మాత్రమే వినియోగించడం మంచిది. రకరకాల బ్రాండ్ లు మిక్స్ చేసి అప్లై చేస్తే చర్మసమస్యలకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

హెన్నా జుట్టు ఆరోగ్యానికి మంచిదని తరచూ అప్లై చేయడం సరికాదు..నెల రోజులకు ఓసారి మాత్రమే అప్లై చేయాలని సూచిస్తున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.