సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ దుశ్చర్యలు నానాటికి తలనొప్పిగా మారాయి. ఎంత సంయమనం పాటించినా పాకిస్థాన్ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. సరిహద్దుల్లో అవతలి నుంచి డ్రోన్ల సాయంతో డ్రగ్స్, ఆయుధాలు జారవిడుస్తున్నారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్న వార్తలు టీవీల్లో, పత్రికల్లో వస్తున్నప్పటికీ అవతలి వాళ్లు మాత్రం తమ చర్యలను ఆపడం లేదు. రోజు కనీసం నాలుగైదు డ్రోన్సుల భారత్ లోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి.
దాడులు చేయాల్సిందేనంటున్న గవర్నర్
పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సరిహద్దుల్లో జిల్లాలో పర్యటిస్తున్నారు. పాక్ వైపు నుంచి జరుగుతున్న దురాగతాలను తెలుసుకునేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. పాకిస్థాన్ కు మర్యాదగా చెప్పడం వల్ల ప్రయోజనం లేదని, అమ్మా – అయ్యా అంటే వినే రకం కాదని, గట్టి దెబ్బ కొట్టాలని పురోహిత్ పిలుపునిచ్చారు. మళ్లీ ఒకటి రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తేనే పాకిస్థాన్ దారికి వచ్చే అవకాశం ఉందని పురోహిత్ అభిప్రాయపడ్డారు. పురోహిత్ ఈ మాట అంటున్నప్పుడు అక్కడున్న అధికారులు, నేతలు తలలూపడం ద్వారా ఆయన ఆలోచనలకు తమ ఆమోదం తెలిపారు. ఒకటి రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరగాల్సిందేనన్నారు.
2016 లో సర్జికల్ దాడులు
ఉరి సెక్టార్ లో ఉగ్రవాద దాడి తర్వాత 2016 సెప్టెంబరు 29న భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైట్స్ చేసింది ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు, పాక్ ఆర్మీ అధికారులు చనిపోయారు. తన వైపు నుంచి జరిగిన నష్టాన్ని పాకిస్థాన్ గోప్యంగా ఉంచింది. సర్టికల్ దాడులు జరిగిన తర్వాత చాలా రోజుల వరకు పాకిస్థాన్ చాలా రోజులు భయంభయంగా బతికింది. ఇప్పుడు మళ్లీ పరోక్ష యుద్ధానికి కొత్త మార్గాలు వెదుక్కుంటోంది.
సమన్వయంతో పనిచేస్తున్న భద్రతా సంస్థలు
పంజాబ్ లో ఒక డ్రగ్స్ బాగా విక్రయమయ్యేవి. యువత డ్రగ్స్ కు బానిసైంది. దానితో వారిని మరింతగా డ్రగ్ ఎడిక్ట్స్ చేసేందుకు పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలను జారవిడుస్తోంది. అయితే భద్రతా సంస్థలైన బీఎస్ఎఫ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, పంజాబ్ పోలీసు సంయుక్త కార్యాచరణతో పాకిస్థాన్ ఆటకట్టిస్తున్నాయి.పాక్ ప్రభుత్వమూ, అక్కడి ఆర్మీ సహకారం లేనిదే డ్రోన్ల ప్రయోగం సాధ్యం కాదని పంజాబీల నమ్మకం. గవర్నర్ పురోహిత్ అభిప్రాయం కూడా అదే. సరిహద్దు గ్రామాల్లో విలేజ్ డిఫెన్స్ కమిటీ పేరుతో ఏర్పాటైన పౌర సంఘాలు కూడా బోర్జర్ పై నిఘా పెట్టి ఉంచాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని భద్రతా దళాలకు అందిస్తున్నాయి. యువతకు, విద్యార్థులకు డ్రగ్స్ అందకుండా చూస్తున్నాయి. డైరెక్టుగా యుద్ధం చేసే దమ్ము లేక పాకిస్థాన్ ప్రభుత్వం ఇలాంటి పరోక్ష యుద్ధానికి దిగుతోందని దేశ ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈ సారి గట్టిగా సమాధానం చెప్పాలని కోరుతున్నారు.