ఏపీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు రాబోతున్నాయన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. పోల్ పర్సంటేజీ, సరళిని చూసిన తర్వాత చాలా మంది ఎన్డీఏ క్లీన్ స్వీప్ ఖాయమని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా బీజేపీ ఐదు నుంచి ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పోటీ చేసింది సర్దుబాటులో భాగంగా ఆరు స్థానాల్లోనే అంటే దాదాపుగా అన్ని స్థానాల్లోనూ విజయావకాశాలు ఉన్నాయి. ఒక్క దాంట్లో మాత్రమే గట్టిపోటీ ఎదుర్కొంటున్నారని అనుకోవచ్చు.
నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లిలో భారీ విజయాలు
ఏపీ బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న ఆరు పార్లమెంట్ స్థానాల్లో లక్ష ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచే నియోజకవర్గాలు మూడు ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. ఆ మూడు నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లి. నర్సాపురంలో బీజేపీ ఎప్పుడు పొత్తులు పెట్టుకుని పోటీ చేసినా అభ్యర్థితో నిమిత్తం లేకుడా భారీ విజయాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి కూడా అదే ట్రెండ్ కొనసాగనుంది., భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ గళం పార్లమెంట్ లో వినిపించనున్నారు. రాజమండ్రిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పూర్తిగా డామినేట్ చేశారు. ఆనపర్తిలోనూ బీజేపీ గుర్తు ఉండటం బాగా కలసి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక సీఎం రమేష్ అనకాపల్లిలో …తనదైన వ్యూహాలతో ముందంజ వేశారు. మంచి విజయం ఖాయమని ఆయన నమ్ముతున్నారు.
తిరుపతి, రాజంపటలో గట్టి పోటీ కానీ గెలుపు ఖాయం
మరో వైపు రాయలసీమ పరిధిలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ గట్టిపోటీ ఎదుర్కొంది. కానీ ఆ రెండు స్థానాల్లో ఎడ్జ్ బీజేపీకే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజంపేటలో పెద్దిరెడ్డి చివరి క్షణంలో పూర్తిగా సైలెంట్ అయ్యారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మిథున్ రెడ్డి తన నియోజకవర్గానికి పెద్దగా సమయంకేటాయించలేదు. దీంతో బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని భావిస్తున్నారు. తిరుపతిలో వరప్రసాద్ .. పాత వ్యక్తి కావడంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు.
అరకులో అంచనాలకు అందని ఫలితం
బీజేపీ పోటీ చేసిన మరో నియోజకవర్గం అరకు.. ఈ నియోజకవర్గంలో గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ చివరి రోజుల్లో కూటమి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు తమదైన శైలిలో ఎలక్షనీరింగ్ చేయడంతో బీజపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రేసులో వచ్చారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సారి 90 శాతం బీజేపీకి స్ట్రైక్ రేట్ ఉంటుదని అంచనా వేస్తున్నారు.