ఏపీ బీజేపీ సందేశం క్లియర్ – ఇక ఎవరైనా వైసీపీ ముద్ర వేయగలరా ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షురాలి నాయకత్వంలో పయనం ప్రారంభించింది. మొదటి రోజే.. పార్టీ విధానాన్ని చాలా క్లియర్ గా నేతలు ప్రజల ముందు ఉంచారు. అసలైన ప్రతిపక్షంగా .. ప్రభుత్వ నిర్వాకాలన్నింటినీ బయట పెట్టారు. కేంద్రం ఇస్తున్న నిధుల దుర్వినియోగం దగ్గర్నుంచి అడుగంటిపోయిన శాంతిభద్రతల పరిస్థితి వరకూ దేనిపైనా సహించలేది లేదని.. ప్రభుత్వాన్ని నిలదీస్తమని స్పష్టం చేశారు. ముందు ముందు ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ మరింత దూకుడుగా ఉంటుందని కొత్త అధ్యక్షురాలు చెప్పకనే చెప్పారు.

ఏకతాటిపై పార్టీ

ఏ పార్టీలో అయినా గ్రూపులు సహజం. ప్రాంతీయపార్టీల్లో అయితే నేతకో గ్రూప్ ఉంటుంది. కానీ జాతీయ పార్టీల్లో మాత్రం అలా ఉండదు. కానీ ..కొంత మంది తమ సలహాల్ని పాటించలేదని.. పార్టీ నాయకత్వంపై అలిగి దూరంగా ఉండటమో… వ్యతిరేక పనులు చేయడమే చేస్తూంటారు. జాతీయ పార్టీలో అయిా అది తప్పదు. అయితే ఏపీ బీజేపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. దాదాపుగా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చారు. పోరాట కార్యాచరణను రెడీ చేసుకుంటున్నారు. ఈ విషయంలో గతంలో ఎప్పుడూ లేనంత పాజిటివ్ గా ఏపీ బీజేపీ కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

పదహారో తేదీన హైకమాండ్ దిశానిర్దేశం

విజయవాడలో పదహారో తేదీన బీజేపీ కీలక సమావేశం జరగబోతోంది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ తో పాటు ఆరెస్సెస్ తరపు ప్రతినిధి శివప్రకాష్ జీ కూడా హాజరవుతారు. కొత్త అధ్యక్షురాలి నియామక లక్ష్యం.. ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై స్పష్టమైన బ్లూ ప్రింట్ ఈ సమావేశంలో కేంద్ర నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వంపై అగ్రనేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. వాటికి కొనసాగింపుగా ఆధారాలతో ప్రజల ముందుకు వెళ్లే కార్యాచరణను ఖరారు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బీజేపీ పై ఏ ముద్ర వేయలేరు !

ఇప్పటి వరకూ బీజేపీపై కొన్ని శక్తులు బలంగా వ్యతిరేక కుట్రలు చేశాయి. బీజేపీ ఓ పార్టీకి అనుకూలమనే అభిప్రాయాన్ని కల్పించే కుట్రలు చేశారు. కానీ ఇప్పుడు అన్నీ తేలిపోతున్నాయి. టీడీపీ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కట్టప్ప పాత్ర పోషించిందని జీవీఎల్, సునీల్ ధియోధర్ నేరుగా ప్రకటించారు. ఎలా చూసినా మొత్తంగా .. ఇప్పుడు బీజేపీపై ఏ పార్టీ ముద్ర లేదు. ఇక తమదైన కార్యాచరణతో ముందుకు వెళ్లడమే మిగిలింది.