ఇప్పుడు రాజకీయాలను సోషల్ మీడియా శాసిస్తోంది. ఒక అంశం ట్రెండింగ్ లోకి వస్తే.. అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. పాజిటివ్ గానా.. నెగెటివ్ గానా అన్నది కూడా అంచనా వేయలేం . అందుకే సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు చాలా బ్యాలెన్స్ డ్ గా ఉపయోగించాలి. బీజేపీ లాంటి పార్టీల్లో అయితే ఈ విషయంలో మరింత నైతిక పరమైన నిబంధనలు ఉంటాయి. ఏపీ బీజేపీ సోషల్ మీడియా కూడా ఈ విలువలన్నీ పాటిస్తూ కొత్త పద్దతిలో సోషల్ మీడియాలో ఆదరణ పెంచుకోవాలని ప్లాన్ చేసుకుంది.
ఏపీ రాజకీయాల సోషల్ మీడియా అంటే.. ఫేకులు, బూతులే !
ఏపీ రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. నేరుగానే బూతులు మాట్లాడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఊరుకుంటారా ?. రెండు ప్రాంతీయ పార్టీల సోషల్ మీడియా సైన్యాలు బూతు పంచాంగంతో .. మార్ఫింగ్‌లతో యుద్ధాలు చేసుకుంటున్నాయి. వాటిని చూస్తున్న జనాలు అసహ్యించుకుంటున్నారు. వీళ్లా ప్రజలకు మేలు చేసే రాజకీయాలు చేసేది అనే అభిప్రాయానికి వస్తున్నారు. అయితే వారు చేస్తున్నారు కదా అని.. బీజేపీ ఎప్పుడూ వారి దారిలోకి వెళ్లలేదు. అందుకే కాస్త వెనుకబడినట్లుగా ఉన్నా.. విలువలకు కట్టుబడిన సోషల్ మీడియా వింగ్‌గా న్యూట్రల్స్ ఆదరణ పొందింది.
పూర్తిగా పాజిటివ్ ప్రచారంలోకి ఏపీ బీజేపీ సోషల్ మీడియా !
ఏపీ బీజేపీ పూర్తిగా పాజిటివ్ ప్రచారం ద్వారా ప్రజల ఆదరణ చూరగొనాలనుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ విజయాలను ప్రచారం చేయడం ద్వారా అనుకున్నది సాధించాలనుకుంటున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రధాన నాయకులంతా ఏపీకి కేంద్రం ఏం చేస్తుందో ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియా విభాగాల్లోనే బీజేపీది ప్రత్యేకమైన శైలి చూపిస్తున్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం
ఆదివారం ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంచార్జ్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో విజయవాడలో సోషల్ మీడియా సమావేశం జరిగింది . ఏపీ రాజకీయాల్లో సామాజిక మాధ్యమాలను, ప్రధాన రాజకీయ పార్టీలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచకుండా స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చేశారు.. మోడీ అభివృద్ధిని ఆధారలతో సహా ప్రజలందరూ ఉంచాలని రానున్న ఎన్నికల్లో దీనిని ఒక అనుసంధానంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీపై అభిమానం ఉండి సోషల్ మీడియాలో పని చేయాలనుకున్న వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.