టీడీపీకి ఏపీ బీజేపీ జీ హూజూర్ అనాలా ? విష్ణువర్ధన్ రెడ్డిపై ఈ దాడి ఎందుకు ?

ఏపీ బీజేపీ నేతే ముఖ్యమంత్రిగా ఉండాలన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తం చేశారు. అంతే వెంటనే.. పెద్ద ఎత్తున ఆయనపై పొలిటికల్ ఎటాక్ ప్రారంభమయింది. ఇతర పార్టీల నేతలు ముఖ్యంగా టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. విష్ణువర్ధన్ రెడ్డిపై ఎప్పట్లాగే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ప్రారంభించారు. వారి ఉద్దేశం బీజేపీ అస్థిత్వాన్ని కాపాడేవాళ్లు నోరు ఎత్తకూడదన్నట్లుగా ఉంది.

బీజేపీ నేత వేరే పార్టీ సీఎం కావాలని కోరుకుంటారా ?

విష్ణువర్ధన్ రెడ్డి ఏబీవీపీ నుంచి ఎదిగిన నేత. ఆయనది వంద శాతం బీజేపీ భావజాలం. ఆ పార్టీ కోసం రెండున్నర దశాబ్లాలుగా కష్టపడుతున్నారు. ఆయన ఏపీలో తన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు. ఏ పార్టీలో ఉన్న నేత అయినా అదే కోరుకుంటారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే చెప్పారు. ఏపీలో తమ పార్టీ అభ్యర్థే సీఎంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. పార్టీపై ఆయనకు ఉన్న నిబద్ధత అలాంటిది. వేరే వారి పల్లకీని తమ భుజాలపై ఎందుకు మోయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అదే తప్పన్నట్లుగా టీడీపీ సోషల్ మీడియా దాడి చేయడం .. విచిత్రంగా మారింది. బీజేపీ తమ పల్లకీ మోయాలని టీడీపీ ఎందుకు కోరుకుంటుందో అలాంటి ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నారో స్పష్టత లేదు.

టీడీపీ ఎందుకా అలుసు తీసుకుంటోంది ?

బీజేపీతో పొత్తులు లేకపోతే టీడీపీ గెలవదు. ఆ విషయం చరిత్రలో జరిగిన అనేక ఎన్నికలతో స్పష్టమైంది. చరిత్ర వరకూ ఎందుకు గత రెండు ఎన్నికలతోనే తేలిపోయింది. 2014లో బీజేపీతో కలిసి గెలిచారు.. విడిపోయి 2019లో ఓడిపోయారు. ఇప్పుడు కలవకపోతే ఓడిపోతామని తెలిసి పొత్తులకోసం పరుగులు పెడుతున్నారు. ఇంత కీలకమైన పొజిషన్ లో బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ తన ప్రాధాన్యను పెంచుకోవాల్సి ఉంటుంది. విష్ణువర్ధన్ రెడ్డి అదే చేస్తున్నారు. అయితే చాలా మంది టీడీపీ కి మద్దతుగా మాట్లాడాలన్నట్లుగా ఒత్తిడి చేస్తున్నారు.

ఒంటరిగా ఎదిగే అవకాశాన్ని చిదిమేసే కుట్రలు

బీజేపీకి ఎప్పటికప్పుడు ఒంటరిగా ఎదిగే అవకాశం వచ్చినప్పుడల్లా.. టీడీపీ ఎటాక్ చేస్తోంది. పొత్తుల పేరుతో మాయ చేసి.. తొక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు బీజేపీ బ లపడుతున్న సమయంలో మరోసారి అదే ప్రయత్నం చేస్తోందన్న అనుమాాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ట్రాప్ లో పడకుండా.. మేజర్ భాగస్వామిగా ఉండేందుకు అంగీకరిస్తేనే పొత్తులు పెట్టుకోవాలన్న అభిప్రాయంతో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆ కారణంతోనే.. బీజేపీ సీఎం అభ్యర్థి అంటున్నారు. దీనికి టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో మరి !