జోరు పెంచిన ఏపీ బీజేపీ – ఒకే రోజు ఐదు జిల్లాల్లో బహిరంగసభలు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు జోరు పెంచుతున్నారు. అగ్రనేతల బహిరంగసభలు విజయవంతం కావడంతో రాష్ట్ర నేతలు రంగంలోకి దిగుతున్నారు. కర్నూలులో ఓబీసీ మోర్చా సమావేశం నిర్వహించారు. తాజాగా ఆదివారం ఒకే రోజు పలు జిల్లాల్లో బహిరంగసభలకు ప్లాన్ చేశారు. అన్ని చోట్ల రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ… ఈ విషయంలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది.

ఆదివారం పలు జిల్లాలో బహిరంగసభలు

ప్రధానమంత్రి మోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలపై ఏపీ బీజేపీ నేతలు ఇంటింటికి వెళ్తున్నారు. ఈ నెల ముఫ్పై తేదీ వరకూ జరగనున్న ప్రచార కార్యక్రమాల్లో బహిరంగసభలూ నర్వహిస్తాయి. జిల్లా స్థాయి బహిరంగసభలను ఒకే రోజు పలు జిల్లాల్లో ఏఖరారు చేశారు. ఏలూరు, అనకాపల్లి, గుంటూరు , విజయవాడ , నరసరావుపేట జిల్లాలో ఆదివారం సభలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లోఒకే రోజు పార్టీ ముఖ్య నేతలు అందరూ పలు ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు.. రాష్ట్రానికి చేసిన మేళ్లు… ప్రజలకు అందిన పథకాల గురించి వివరించనున్నారు.

ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ

కేంద్ర ఇస్తున్న సాయంతోనే రాష్ట్రం మనుగడ సాగిస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. పరిమితమైన వనరులతో వీలైనంత ప్రబావవంతంగా ఏపీ కోసం బీజేపీ ఏం చేస్తోంది ఇంటింటికి చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంపై చార్జిషీట్లు వేసింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఇప్పుడు మోదీ పాలన ప్రచారానికి ఇంటింటికి వెళ్తున్నారు. ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీలవల్లనే ఎక్కువ రాష్ట్రానికి ప్రయోజనం … అని కుల , మతాల ప్రకారం చూసి ఓట్లు వేయవద్దని కోరుతున్నా రు.

ప్రచార భేరీ ముగిసేలోపు మరికొంత మంది కేంద్ర మంత్రుల రాక !

మోదీ తొమ్మిదేళ్ల పాలనపై నిర్వహిస్తున్న సంపర్క అభియాన్ లో భాగంగా ప్రచారం చేసేందుకు పలువురు కేంద్ర మంత్రులు ఏపీకి రానున్నారు. మరో రాష్ట్ర స్థాయి బహిరంగసభను నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులతో సంబంధం లేకుండా ఎన్నికలకు సమాయత్తం కావడానికి బీజేపీ నేతలు ఇప్పటికే సన్నాహాలు చేసుకుటున్నారు. అందులో భాగంగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.