పవర్ షేరింగ్ ఉంటేనే పొత్తులు క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ ?

ఏపీ బీజేపీని తక్కువ చేసే ప్రయత్నాలను ఆ పార్టీ నేతలు గట్టిగా తిప్పి కొడుతున్నారు. బీజేపీతో పొత్తు అంటూ టీడీపీ అనుకూల మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. తాము
ఎన్నికల్లో పోటీ చేసేది అధికారంలోకి రావడానికి కానీ ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి కాదని .. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధ్ రెడ్డి తేల్చి చెప్పారు. బిజెపి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని పవర్ షేరింగ్ ఉంటేనే పొత్తు గురించి ఆలోచిస్తమని ఆయన తేల్చి చెప్పారు.

ఒకటి, రెండు సీట్లకు బీజేపీ పొత్తుకు సిద్ధమవుతుందా ?

టీడీపీ, జనసేన పొత్తుల పేరుతో.. బీజేపీని లాగాలని ప్రయత్నిస్తున్నాయి. వారు సీట్ల ప్రకటన చేయకపోవడానికి కారణం.. ఎలాగైనా బీజేపీని పొత్తుల్లోకి లాగాలనేనని అంటున్నారు. ఏపీ బీజేపీలో కొంత మంది పొత్తులకు అనుకూలంగా ఉండటంతో వారిని పట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ఒకటి, రెండు సీట్లు ఇచ్చినా పర్వాలేదన్నట్లుగా కొంత మంది వ్యవహరిస్తూండటమే దీన్నే ఆసరాగా చేసుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ.. ఒకటి రెండు సీట్లలో పోటీ చేయడం కన్నా.. ఒంటరిగా పోటీ చేయడం గౌరవప్రదమని.. బీజేపీలోనే పుట్టి పెరుగుతున్న నేతలంటున్నారు.

పవన్ కల్యాణ్‌కు కాపు పెద్దలు చెబుతున్నది అర్థం కాదా ?

పవన్ కల్యాణ్ చంద్రబాబు ట్రాప్ లో ఉన్నారు. పవర్ షేరింగ్ కోసం పట్టుబట్టాల్సి ఉన్నా ఆయన ఆ పని చేయడం లేదు. జనసేన కూడా అదే కోణంలో ఆలోచించాలని పవన్ కళ్యాణ్ గారికి జోగయ్య చెబుతున్నారు, జనసేనకు 40-60 సీట్లు ఇవ్వాలని..అప్పుడే ఓట్ల బదిలీ జరిగేందుకు అవకాశం ఉంటుందని జోగయ్య చెబుతున్నారు. చంద్రబాబును సీఎం పదవి రెండున్నారేళ్లు పవన్ కు ఇస్తామని ప్రకటన చేయాలని జోగయ్య డిమాండ్ చేసారు. రావాల్సిన నిష్పత్తిలో సీట్లు రాకపోతే జరిగే నష్టానికి పవన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేన కు పవన్ కోరిన సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా లేరని చెబుతున్నారు. అయినా పవన్ .. ప్లాన్ బీ గురించి ఆలోచించడం లేదు.

బీజేపీతో కలిసి నడిస్తేనే పవన్ కు మేలు !

బీజేపీతో కలిసి నడిస్తేనే పవన్ కు మేలు జరుగుతుందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకరిని ఒడించి.. మరొకర్ని గెలిపించే రాజకీయం చేయాల్సిన అవసరం పవన్ కు ఎందుకన్న ప్రశ్న సహజంగా వస్తుంది. దాన్ని కూడా ఆయన ఆలోచించలేకపోతున్నారని అంటున్నారు.