ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి . ఓ వైపు ఏపీలో ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు మరో వైపు ఢిల్లీలో ఏపీ పొత్తుల వ్యవహారాలు అన్నీ ఓ కొలిక్కి వస్తూండటంతో… మొత్తం రాజకీయం మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యామ్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా అనేక కీలక భేటీలు నిర్వహించారు. అమిత్ షాతోనూ సమావేశం అయ్యారు. ఇటు ఏపీలో వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై పురందేశ్వరి పూర్తి వివరాలు బయట పెట్టి కలకలం రేపారు.
బీజేపీతో జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం !
జనసేన ఇంత కాలం బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా అన్న అభిప్రాయాన్ని కల్పించేలా పవన్ వ్యవహరించారు. కానీ ఎన్డీఏ భేటీ తర్వాత ఆయన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అమిత్ షాతో భేటీ లో … రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. ఎంత బలంగా తమదైన ముద్ర వేస్తాయో పవన్ వివరించినట్లుగా తెలుస్తోంది. ఓట్లు చీలిపోకుండా ఇతర పార్టీలు కలిసి వస్తే..కలుపుకుందామని .. కానీ ఆ కారణం చెప్పి … లేని పోని షరతులకు అంగీకరించడం ఎందుకని ఇరు వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారంటనే.. జనసేనకు బీజేపీ ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో అర్థం అవుతుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ వ్యూహకర్తలతో కొన్నిరహస్య సమావేశాల్లో పాల్గొన్న పవన్
బీజేపీ సౌత్ మిషన్ పెట్టుకుంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ వర్క్ చేస్తున్నట్లుగా చెబుతారు. ఆ టీమ్ ఏపీలో రాజకీయాలపై ఎప్పటికప్పుడు రాజకీయాలపై విశ్లేషణ చేసి వ్యూహాలను ఖరారు చేస్తూంటారు. ఆ టీమ్ లో కీలక సభ్యులు పవన్ ను కలిసినట్లుగా చెబుతున్నారు. వారు ఏపీలో రాజకీయ పరిస్థితులు… ఎలా మారబోతున్నాయి… బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం వల్ల రాజకీయం ఎలా మారుతుందనేది వివరించినట్లుగా చెబుతున్నారు. మారుతున్న రాజకీయాలకు ఆ విశ్లేషణ దగ్గరగా ఉండటంతో పవన్ కూడా. వ్యూహాత్మంగా వ్యవహరించేందుకు రెడీ అన్నారని అంటున్నారు.
వైసీపీపై పోరాటం మరింత ఉద్ధృతం
వైసీపీ పై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ ప్రభుత్వ ఆర్థిక ఆక్రమాలపై పూర్తి స్థాయిలో వివరాలు బయట పెట్టిన వ్యవహారం సంచలనం అయింది. ఆ వివరాలన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అ డబ్బులన్నీ ఏం చేశారని అడిగిన దానికి సమాధానం లేకుండా పోయింది. ఇప్పుడు మరింత దూకుడుగా ఏపీ ప్రభుత్వ అక్రమాలను బయట పెట్టేందుకు రెడీ అయింది. త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభం కానుంది.