దేశంలో ఎక్కడైనా మత పరమైన రిజర్వేషన్లు ఉన్నాయా ? . ఎక్కడా లేవు. కానీ తెలంగాణలో ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే హిందువులకూ ఇవ్వాలి కదా. అయితే ఇలాంటి వాటికి చోటివ్వకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లింల రిజర్వేషన్లు కొనసాగించడమే కాదు పన్నెండు శాతం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి వారినీ మోసం చేస్తున్నారు. అందుకే తెలంగాణ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. తాము రాగానే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తి వేస్తామని ప్రకటించింది.
ముస్లింలను అప్పీజ్ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నం
ముస్లింలకు ఇప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వైఎస్ హయాంలో ముస్లింలను ఆకట్టుకోవడానికి వీటిని ఇచ్చి కులాల జాబితాలో ఆయా వర్గాలను చేర్చారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం చెల్లవు. అందుకే ఈ రిజర్వేషన్లు ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉన్నాయి. వీరికి ఉన్న రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు
ఆ తీర్మానం తర్వాత కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. మునుగోడు ఉపఎన్నికలకుముందు ఎస్సీ రిజర్వేషన్లపై అధికారం లేకపోయినా జీవవో ఇచ్చారు కానీ.. ముస్లిం రిజర్వేషన్లకు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తారు. బీజేపీ ఈ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించింది. కర్ణాటకలో ఇప్పటికే ఇప్పటికే కర్ణాటకలో ఇలా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేశారు.
కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓవైసీ
ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల అస్త్రాన్ని కేసీఆర్ బయటకు తీశారు. అదే సమయంలో . ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఓవైసీ తెరపైకి తెచ్చారు. మరి ఎస్టీలకు ఇస్తే మా సంగతేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఓవైసీ ఇలా డిమాండ్ చేయడానికి కూడా కేసీఆరే కారణం. ఉద్యమ సమయంలో ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన సమయంలో ముస్లిం వర్గాలకు చెందిన ‘బీసీ–ఈ’ గ్రూపు పైన అధ్యయనం చేయడానికి మాత్రమే సుధీర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుధీర్ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ ముస్లిం మైనార్టీ వర్గాలకు 9శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసులు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీ–ఈ గ్రూపుకు రిజర్వేషన్లను 4శాతం నుండి 12శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లులో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారు. కానీ కేంద్రం అనుమతించలేదు.
మత రాజకీయాలు.. ముస్లిం రిజర్వే,షన్లకు బీజేపీ వ్యతిరేకం
బీజేపీ దేశంలో మైనార్టీవర్గాలను ఆకట్టుకునే రాజకీయాలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి బీజేపీది అదే విధానం. ముస్లిం రిజర్వేషన్లనూ తొలగిస్తామని చెబుతోంది. తెలంగాణలో రాను రాను మజ్లిస్ ప్రాబల్యం పెరుగుతోంది. ఇది హిందూ సమాజానికి ప్రమాదకరంగా మారింది. అందుకే అందరికీ సమానత్వం దిశగా.. ఏ మతాన్ని అప్పీజ్ చేయకుండా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకోనుంది.